Nayanthara: భర్త మూవీ నుంచి నయనతార తప్పుకున్నారా.. అసలు కారణాలివేనా?

సౌత్ ఇండియాలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో నయనతార ముందువరసలో ఉంటారు. నయనతార నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించాయి. ఈ రీజన్ల వల్లే నయన్ 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో డిమాండ్ చేసినా నిర్మాతలు మాత్రం ఆమె అడిగినంత ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ఎల్ఐసీ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ టైటిల్ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

అయితే రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతతో విబేధాలు రావడంతో నయనతార ఈ సినిమా నుంచి తప్పుకుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశాలు ఉంటాయి. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని విఘ్నేష్ శివన్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.

మరోవైపు వయస్సు పెరుగుతున్నా నయనతార యంగ్ లుక్ లో కనిపిస్తూ ఆఫర్లను సొంతం చేసుకుంటూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. నయన్ తాజాగా నటించిన అన్నపూరణి సినిమా సైతం కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా వల్ల మనోభావాలు దెబ్బ తిని ఉంటే తనను క్షమించాలని నయనతార సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను రిలీజ్ చేయగా ఆ లేఖ నెట్టింట వైరల్ అయింది.

నయనతార, (Nayanthara) విఘ్నేష్ శివన్ పెళ్లి తర్వాత వరుసగా వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. నయన్, విఘ్నేష్ వివాదాలకు దూరంగా ఉంటూ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus