Nayathara: నయనతార సినిమాకు తొలగిన అడ్డంకులు!

సినిమా టికెట్‌ కంటే.. ఇంటర్వెల్‌లో తినే స్నాక్స్‌కే ఎక్కువ డబ్బులు అవుతాయి. రెగ్యులర్‌ సినీ గోయర్స్‌, రెగ్యులర్‌గా చెప్పే మాటే ఇదీ. మీరు కూడా ఎప్పుడో ఓసారి ఇలా అనే ఉంటారు. పాప్‌కార్న్‌, కూల్‌ డ్రింక్స్‌, సమోసా.. ఇలా చాలానే అమ్ముకుని థియేటర్ల వాళ్లు బాగానే సంపాదిస్తారు అని అంటారు. ఈ మాటలను మొన్నీమధ్య వరకు థియేటర్ల వాళ్లు, సినిమాల వాళ్లు ఒప్పుకోలేదు. అయితే ఈ మొత్తం కాన్సెప్ట్‌ నిజమని నయనతార ‘కనెక్ట్‌’ సినిమా తేల్చేసింది. ఈ సినిమాకు ఇంటర్వెల్‌ లేదు అనేసరికి..

థియేటర్ల వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇన్నాళ్లూ కాదు అంటున్న ‘ఇంటర్వెల్‌ బిజినెస్‌’ నిజమే అని తేలిపోయింది. నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘కనెక్ట్‌’. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్‌ యజమానుల నుండి ఎదురుదెబ్బ తగిలింది. విరామమే లేకుండా సినిమాను ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని థియేటర్‌ యజమానులు ఆసక్తి చూపించలేదు.

దీనిపై చాలా చర్చలు జరిగాయి. టికెట్‌ డబ్బులతోనే థియేటర్లు, సినిమాలు బతుకున్నాయని ఇన్నాళ్లూ చెప్పిన సినిమా జనాలు.. అసలు కారణం ఇంటర్వెల్‌ ఖర్చు చెప్పకనే చెప్పేశారు. అయితే తాజాగా ఈ సమస్యకు పరిష్కారం లభించింది. సినిమాకు ఇంటర్వెల్‌ ఇవ్వడానికి టీమ్‌ ఓకే చెప్పింది. ఇంతకీ ఏమైందంటే.. ‘కనెక్ట్‌’ సినిమా నిడివి 99 నిమిషాలు. దీంతో విరామం లేకుండా సినిమాను ప్రదర్శిద్దామని తొలుత అనుకున్నారు. అయితే ఇప్పుడు 59 నిమిషాలకు విరామం ఇవ్వనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. దీంతో సినిమా విడుదలకు రూట్‌ క్లియర్‌ అయింది.

సినిమా నిర్మాత విఘ్నేష్‌ శివన్‌ మాట్లాడుతూ ‘‘సినిమా మొదలైన దగ్గరి నుంచి ముగిసే వరకూ ప్రేక్షకుడు కుర్చీ నుండి లేవకుండా కొన్ని సినిమాలు సాగుతాయి. ‘కనెక్ట్‌’ కూడా అలాంటిదే. అందుకు నో ఇంటర్వెల్‌ ఆలోచన చేశాం. కానీ ఇప్పుడు మా ఆలోచనకు మద్దతు దొరకలేదు’’ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన కూడా వెనక్కి తగ్గి సినిమాకు ఇంటర్వెల్‌ ఇవ్వాల్సి వచ్చింది. ఈ లెక్కన సినిమా బతికేది టికెట్‌ డబ్బులతోనా? లేక ఇంటర్వెల్‌ స్నాక్స్‌ డబ్బులతోనా అనే చర్చ సోషల్‌ మీడియాలో సాగుతోంది. దీనికి సమాధానం ఎవరు చెబుతారో చూడాలి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus