NBK108: బాలకృష్ణ – రావిపూడి సినిమాపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌… తేడా కొడితే కష్టమంటూ..!

  • May 9, 2023 / 04:41 PM IST

ఒక సినిమాకు ఎంత బడ్జెట్‌ పెట్టాలి అనే విషయం ఎలా నిర్ణయిస్తారు. ఈ విషయంలో పక్కగా ఓ రూల్‌, రూలు కర్ర లేవు కానీ.. గతంలో ఆ హీరో సినిమా ఎంత వసూళ్లు వచ్చాయి. ఎంత పెడితే, ఎంత లాభం వచ్చింది లాంటి పాయింట్లు పట్టుకుని బడ్జెట్‌ పరిమితి నిర్ణయిస్తారు అని అంటుంటారు. అయితే ఈ లెక్కలు తప్పి టాలీవుడ్‌లో ఓ అగ్ర హీరో సినిమా తెరకెక్కుతోందా. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అదే నందమూరి బాలకృష్ణ – అనిల్‌ రావిపూడి సినిమా అంటున్నారు.

బాలకృష్ణ 108వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫుల్‌ జోష్‌లో సాగుతోంది. ఇటీవల బాలయ్య, శ్రీలీల మీద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు మరికొన్ని మేజర్‌ సీన్స్‌ షూటింగ్‌ పనుల్లో టీమ్‌ బిజీగా ఉందట. అయితే వీటి కోసం టీమ్‌ ఖర్చు పెడుతున్న మొత్తమే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది అని చెప్పాలి. బాలయ్య రీసెంట్‌ సినిమాల కంటే ఈ సినిమాకు కాస్త ఎక్కువగానే ఖర్చుపెడుతున్నారు అని అంటున్నారు.

అయితే, దానికేముంది నిర్మాత ఎంత కావాలంటే అంత పెడతారు. సినిమా బాగా వస్తే ఆ డబ్బులు అవే వచ్చేస్తాయి అని అందాం అనుకుంటున్నారా? అయితే ఇక్కడే ఓ విషయం ఉంది. ఇండస్ట్రీలో సీనియర్‌ దర్శకనిర్మాతలు చెప్పే విషయం ఒకటుంది. సినిమాకు ఎంత పెట్టాలి అనే విషయంలో ముందే నిర్ణయం తీసుకోవాలి. సినిమా స్టార్ట్‌ అయ్యాక ఆ లెక్కలు మారితే ఇబ్బంది అంటుంటారు. తర్వాత వస్తాయా లేదా అనేది పక్కనపెడితే ఇలా మారొద్దు అనేది సీనియర్ల మాట.

ప్రస్తుతం బాలయ్య సినిమా (NBK108) ఇంటర్వెల్ ఫైట్ షూట్ చేస్తున్నారట. ఈ ఫైట్ కోసం ఇరవై రోజులు షెడ్యూల్‌ పెట్టుకున్నారట. అలా మొత్తం ఫైట్‌ అయ్యేసరికి సుమారు రూ.35 లక్షల నుండి రూ. 50 లక్షలు అవుతుంది అంటున్నారు. అంటే సుమారు రూ.7 కోట్ల నుండి రూ. 8 కోట్లు అవుతుంది అంటున్నారు. ఇంకా సెట్‌ ఖర్చు ఉంటుంది. అలా మొత్తంగా రూ.10 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇలా ఒక ఫైట్‌కే ఇంత ఖర్చుపెడితే బడ్జెట్‌ పెరిగపోదా అనే డౌట్‌ వస్తోంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus