Baba Re-Release: ఆ సినిమాను రీరిలీజ్ చేసి తప్పు చేస్తున్నారా?

రజనీకాంత్ హీరోగా నటించిన బాబా సినిమా రజనీకాంత్ సినీ కెరీర్ లోని డిజాస్టర్లలో ఒకటనే సంగతి తెలిసిందే. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. రజనీకాంత్ సినీ కెరీర్ లో భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ సినిమాకు భారీగా నష్టాలు వచ్చిన సమయంలో రజనీకాంత్ కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించడం జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

అయితే బాబా మూవీ రీరిలీజ్ దిశగా అడుగులు పడుతున్నాయి. అప్పట్లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాను మళ్లీ రీరిలీజ్ చేయడంపై ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. బాబా సినిమాను రీరిలీజ్ చేసినా పెద్దగా లాభం ఉండదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాబా సినిమాకు రజనీకాంత్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన సంగతి తెలిసిందే. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా రజనీకాంత్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా ఉంది.

కలర్ గ్రేడింగ్ చేసి ఈ సినిమాను రీరిలీజ్ చేయనుండగా రీరిలీజ్ లో అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు బదులుగా రజనీకాంత్ హిట్ సినిమాలను మళ్లీ విడుదల చేస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

జైలర్ మూవీతో రజనీకాంత్ కెరీర్ లో మరో సక్సెస్ చేరడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రజనీకాంత్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా రజనీకాంత్ ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus