ఫీలవుతున్న వెంకీ అభిమానులు.. ఇలాంటి రోల్స్ ఎందుకంటూ?

విక్టరీ వెంకటేశ్ తన సినీ కెరీర్ లో ఫ్యామిలీ సినిమాల ద్వారా ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వెంకటేశ్, రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రిటిక్స్ నుంచి రానా నాయుడు వెబ్ సిరీస్ కు పాజిటివ్ రివ్యూలే వచ్చినా వెంకీ రోల్ విషయంలో మాత్రం ఆయన ఫ్యాన్స్ సంతోషంగా లేరని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ పాత్ర మాట్లాడిన మాటలు ప్రేక్షకులకు నచ్చడం లేదు. మహిళా ప్రేక్షకులలో వెంకటేశ్ కు ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా డైలాగ్స్ ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్ రాబోయే రోజుల్లో సైతం ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం సైంధవ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. శైలేష్ కొలను డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

శేలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ సక్సెస్ సాధించగా ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శైలేష్ కొలను సినిమాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇతర డైరెక్టర్ల సినిమాలకు భిన్నమైన కథలను శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. శైలేష్ కొలను వెంకటేశ్ కు ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాల్సి ఉంది. వెంకటేష్ ఒక్కో సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

వెంకటేశ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సమయంలో రానా నాయుడు ప్రాజెక్ట్ ను ఎంపిక చేసుకుని తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వెంకటేశ్ ఇకపై ప్రాజెక్ట్ ల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. వెంకటేశ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus