Naga Chaitanya, Sobhita: చైశోభిత పెళ్లి… కాదు కాదంటూనే ఓటీటీకి ఇచ్చేశారా?

Ad not loaded.

ప్రముఖ కథానాయిక నయనతార (Nayanthara)  , దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న సమయంలోనే నాగచైతన్య (Naga Chaitanya) – శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala)  పెళ్లి జరిగింది. దీంతో వీళ్ల పెళ్లి కూడా డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేస్తారని, దీని కోసం భారీ డీల్‌ ఒకటి కుదిరింది అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే వాళ్ల టీమ్‌ నుండి ఇవంతా పుకార్లే అనే సమాచారం వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే మళ్లీ ఆ విషయం చర్చకు వస్తోంది.

Naga Chaitanya, Sobhita

పెళ్లికి సంబంధించిన విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ఓటీటీలకు అమ్ముకునే ట్రెండు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. నయనతార – విఘ్నేశ్‌ శివన్‌ వీడియో రావడం, దాంతో పెద్ద పంచాయితీలు జరగడం మనం చూశాం. ఇప్పుడు అంత అవకాశం లేకపోయినా నాగ చైతన్య, శోభిత పెళ్లి వీడియో డాక్యుమెంటరీగా రెడీ చేస్తున్నారని టాక్‌. నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో ఈ వీడియో స్ట్రీమింగ్‌కి వస్తుంది అని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చైతు – శోభిత పెళ్లి ఘనంగా జరిగింది.

లిమిటెడ్ గెస్టులు, కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ వేదిక నుండి చాలా తక్కువ ఫొటోలు బయటకు వచ్చాయి. అవి కూడా దంపతుల సోషల్‌ మీడియా నుండే. దీనికి కారణం మొత్తం పెళ్లిని డాక్యుమెంటరీ చేసి రిలీజ్‌ చేయడానికి అని. దీని కోసం రూ.50 కోట్ల వరకు తీసుకున్నారు అనే చర్చ జరుగుతోంది. అయితే, ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ తన భవిష్యత్తు ప్రాజెక్టులను అనౌన్స్‌ చేసింది. అందులో దీనికి సంబంధించిన సమాచారం లేదు. ఎక్స్‌క్లూజివ్‌ కాబట్టి చెప్పలేదు అనుకుందాం.

మరి తొలుత ఎందుకు లేదు అని చెప్పినట్లు. ఏమో ఈ విషయంలో నాగచైనత్యనే క్లారిటీ ఇవ్వాలి. ‘తండేల్‌’ (Thandel)  కోసం బయటకు వస్తున్నాడుగా ఏదో సందర్భంలో మీడియా ఈ విషయంలో అడుగుతుంది. అప్పుడు క్లారిటీ కూడా వస్తుంది. చైతు సినిమాల సంగతి చూస్తే ‘తండేల్‌’ను ఈ నెల 7న రిలీజ్‌ చేస్తున్నారు. సాయిపల్లవి (Sai Pallavi)  హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు చందు మొండేటి (Chandoo Mondeti) దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ ఈ సినిమాను నిర్మించింది.

ప్రియాంక చోప్రా మరదలి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus