Anushka Sharma: జనాలను ఇబ్బంది పెట్టిన అనుష్క ప్రమోషన్స్!

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న ఈమె కొన్నాళ్లకు ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తరువాత సినిమాలకు దూరమైన అనుష్క రీసెంట్ గా ‘కాలా’ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇదిలా ఉండగా.. ఇటీవల Puma India బ్రాండ్ తన అనుమతి లేకుండా తన ఫొటోలను బ్రాండ్ ప్రమోషన్ కి వాడడంతో అనుష్క సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది.

కాంట్రాక్ట్ ముగిశాక అలా ఎలా చేస్తారని ఇన్‌స్టా వేదికగా సదరు సంస్థను ప్రశ్నించింది. అనుష్కకు సపోర్ట్ చేస్తూ విరాట్ కోహ్లీ కూడా కామెంట్ చేశారు. కానీ అదంతా ఫేక్ పబ్లిసిటీ స్టంట్ అని తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా ముంబై వీధుల్లో అనుష్క ఇదే బ్రాండ్ టీషర్ట్ ధరించి కనిపించింది. తెలుపు రంగు టీ-షర్ట్, స్పోర్ట్స్ ప్యాంట్, జాకెట్‌ వేసుకొని కనిపించింది అనుష్క. రెడ్ కలర్ ఓపెన్ కారుపై ఎక్కి అభిమానులను పలకరిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది.

రోడ్ మీద ఆమె బ్రాండ్ ను ప్రమోట్ చేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీని కారణంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా దర్శనమిచ్చింది. ఇది చూసిన నెటిజన్లు అనుష్క మీద మండిపడుతున్నారు. ప్రమోషన్స్ కోసం అందరినీ ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. పోలీసులు వీళ్లను మాత్రం ప్రశ్నించరంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.

ఇదివరకు Puma Indiaను టార్గెట్ చేస్తూ అనుష్క చేసిన పోస్ట్ చీప్ పబ్లిసిటీ స్టంట్ అంటూ మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ పబ్లిసిటీ గేమ్ లో అనుష్కతో పాటు ప్యూమా కూడా బాగా ఆడింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అనుష్క కెరీర్ విషయానికొస్తే.. త్వరలోనే ఈమె భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో కనిపించనుంది. ఈ సినిమా కోసం అనుష్క ట్రైనింగ్ తీసుకుంటుంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus