Rakul Preet: రకుల్ కు బాలీవుడ్ పైనే ప్రేమ ఎక్కువగా ఉందంటూ నెటిజన్లు ఫైర్!

మన తెలుగు సినిమాలకు ఎక్కువగా నార్త్ బ్యూటీలనే పట్టుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజింగ్ చేయడానికి కానీ.. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి కానీ ఇబ్బంది పడరు. పైగా స్పీడ్ గా ఉంటారు. మన దర్శకనిర్మాతలకు కావాల్సింది అదే కదా. అందుకే ఇక్కడికి తీసుకొచ్చి కిరీటం పెడతారు. వాళ్ళ టైం బాగుండి హిట్లు కొడితే.. ఇక నెత్తిమీద పెట్టేసుకుంటారు. కానీ నార్త్ హీరోయిన్ల ఫైనల్ టార్గెట్ మాత్రం బాలీవుడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనే..!

ఈ గ్యాప్లో ఇక్కడ మ్యాగ్జిమమ్ సంపాదించుకోవాలి..! ఫైనల్ గా అక్కడికి వెళ్ళాక సౌత్ సినిమా గురించి ఏదో ఒక నెగిటివ్ కామెంట్ చేస్తూనే ఉంటారు. గతంలో తాప్సి, ఈ మధ్య కాలంలో రాశీ ఖన్నా.. అలా ఇంకా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రకుల్ కూడా వచ్చి చేరింది. విషయంలోకి వెళితే.. బాలీవుడ్ సినిమాలను టాలీవుడ్ సినిమాలు, సౌత్ సినిమాలు డామినేట్ చేస్తున్నాయి కదా అనే ప్రశ్న రకుల్ కు ఎదురైంది.

అందుకు ఆమె మాట్లాడుతూ.. ” సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి మాట్లాడతారు. హిందీ సినిమాలు, ప్రాంతీయ సినిమాలు ఏదైనా ఒక్కటే…! ఇలా పోల్చి చూడటం సరికాదు. ఇవన్నిటికన్నా ప్రేక్షకులే ముఖ్యం. మంచి సినిమాలను ఆదరించేది వాళ్ళే..! ఇండియాలో గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నారు.

వాళ్ళు మంచి సినిమాలు తీసి ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తారు” అంటూ సంబంధం లేకుండా మాట్లాడింది రకుల్. చివర్లో బాలీవుడ్ సినిమాని తక్కువ చేసి చూడటం సరికాదని కూడా ఈమె చెప్పుకొచ్చింది. అందుకే నెటిజన్లు ఆమె పై మండిపడుతున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus