ఎన్టీఆర్ జక్కన్న ఫోటోలను చూసి అభిమానులు అలా చెబుతున్నారా?

ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ ఒక సినిమాను మించి మరొకటి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాలు తెరకెక్కగా ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్ భీమ్ రోల్ లో నటించగా ఈ సినిమా ఏకంగా 1200 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా రావాలని తారక్ సోలో హీరోగా జక్కన్న ఈ సినిమాను తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రాజమౌళి తలచుకుంటే ఎన్టీఆర్ తో మరో సినిమా తీయడం కష్టం కాదని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ గురించి రాజమౌళి చాలా సందర్భాల్లో పాజిటివ్ గా చెప్పిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం రాజమౌళి గురించి చాలా సందర్భాల్లో పాజిటివ్ గా చెప్పారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటించడానికి రాజమౌళిపై ఉన్న నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని ఎన్టీఆర్, చరణ్ పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ ప్రపంచస్థాయిలో ఎన్టీఆర్, చరణ్ పేర్లు మారుమ్రోగడానికి కారణమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేసేలా జక్కన్న తారక్ కు మరో హిట్ ఇస్తే చాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. తారక్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ విషయంలో రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి. తారక్, రాజమౌళిలను ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు ఈ కామెంట్లు వినిపిస్తున్నాయి. తారక్, రాజమౌళి కాంబో మళ్లీ ఎప్పటికి సాధ్యమవుతుందో చూడాలి.

ఎన్టీఆర్ సైతం జక్కన్న డైరెక్షన్ లో మరో సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus