బాహుబలి, బాహుబలి2 సినిమాలు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంలో శివగామి పాత్ర కీలకం కాగా సలార్ సినిమా సక్సెస్ లో రాధారమా మన్నార్ పాత్ర కూడా అంతే కీలకం కావడం గమనార్హం. శ్రియా రెడ్డి ఈ పాత్రను పోషించగా ఆ పాత్రకు ఆమె పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఓజీ సినిమాలో సైతం శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రియా రెడ్డి రూపంలో టాలీవుడ్ కు మరో అద్భుతమైన నటి దొరికినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నెగిటివ్ షేడ్స్ పాత్రలకు శ్రియా రెడ్డి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. శ్రియా రెడ్డి సలార్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ప్రశాంత్ నీల్ రాధారమ రోల్ ను స్క్రీన్ పై ఎంతో అద్భుతంగా చూపించారని అన్నారు. తనకు చెప్పిన స్క్రిప్ట్ ను చెప్పినట్టుగానే తెరపైకి తెచ్చారని శ్రియా రెడ్డి కామెంట్లు చేశారు. రాధారమ ఎప్పుడూ నవ్వదని ఆ పాత్ర గురించి ప్రశాంత్ చెప్పిన మాటలు గుర్తున్నాయని ఆమె తెలిపారు.
ఒక మహిళ కొరకు ఇంత అద్భుతమైన పాత్రను క్రియేట్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలని (Sriya Reddy) శ్రియా రెడ్డి పేర్కొన్నారు. రాధారమ రోల్ తో నన్ను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చినందుకు ప్రశాంత్ నీల్ కు ధన్యవాదాలు అని శ్రియారెడ్డి తెలిపారు. సలార్2 సినిమాలో రాధారమ మన్నార్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఆమె రోల్ కు సంబంధించి షాకింగ్ ట్విస్టులు ఉన్నాయని భోగట్టా.
అప్పుడప్పుడు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రియారెడ్డి కెరీర్ మొదలైంది. పొగరు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. శ్రియారెడ్డి యాక్టింగ్ స్కిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రియారెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుని ప్రశంసలు అందుకుంటున్నారు.