బిగ్ బాస్ 4: మోనాల్ పై నెటిజన్స్ ఫైర్..!

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం వాతావరణం వేడెక్కుతోంది. రీసంట్ గా పులి మేక అంటూ అభిజిత్, అఖిల్ వాగ్వివాదం పెట్టుకున్న సంగతి తెలిసిందే. అది అయ్యిన ఒక్కరోజులోనే ఇప్పుడు మోనాల్ ముద్దు వైరల్ అవుతోంది. కమాండెంట్ టాస్క్ లో ఛాలెంజస్ గెలిచిన ముగ్గురిని కెప్టెన్సీ రేసులో నిలబెట్టాడు బిగ్ బాస్. ఇందులో అఖిల్, అభిజిత్, హారికలు ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత అఖిల్ బర్త్ డే లో ఫన్ చేశారు హౌస్ మేట్స్. చిన్న సైజ్ కేక్ ని రెడీ చేసి కట్ చేయించారు. ఇక్కడే మోనాల్ అఖికి బర్త్ డే విషెష్ చెప్పింది. ఆతర్వాత గార్డెన్ ఏరియాలో ఉన్నప్పుడు గట్టిగా హగ్ ఇచ్చి అఖిల్ ని ముద్దులతో ముంచెత్తింది. ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది.

తర్వాత ఇలాగ నువ్వు ముద్దులు ఇస్తానంటే రోజు నా బర్త్ డే చేస్కుంటా అంటూ అఖిల్ అన్నాడు. అంతకుముందు మార్నింగ్ అన్ సీన్ లో చూసినట్లయితే, ఫ్రెండ్ మాత్రమేనా నేనేం కాదా అంటూ మోనాల్ దీర్ఘాలు తీసింది. నా ముఖం చూసి చెప్పు.. కేవలం ఫ్రెండేనా అంటూ మాట్లాడింది. దీంతో అఖిల్ అక్కడ మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇక నైట్ ఈ ముద్దుల వర్షంలో తడిసిముద్దయిన తర్వాత అఖిల్ ప్రశాంతంగా నిద్రపోయాడు.

ఇప్పుడు మోనాల్ పెట్టిన ముద్దుని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఇది ఫ్యామిలీస్ చూసే షో ఇలాంటివి ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారని కూడా ఫైర్ అవుతున్నారు. నిజానికి మోనాల్ ముద్దు అనేది కొత్తేం కాదు, అవినాష్ తో సరదాగా, అభితో పలకరింపుకి, నోయల్ తో స్నేహపూర్వకంగా ఇలా ముద్దులు పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటోస్ అన్నీ కలిపి చూపిస్తూ.. మోనాల్ ముద్దు.. మాకు వద్దు వద్దు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సరదాగా చేసిన కామెంట్స్ అయినా కూడా విషయం సీరియస్ గా మారే అవకాశమే కనిపిస్తోంది మరి. అదీ మేటర్.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus