సినిమా వాళ్ల సెంటిమెంట్ల గురించి మనకు తెలియనిది కాదు. అలా కొంతమంది హిట్ సినిమా డేట్ అనే సెంటిమెంట్‌ను పట్టుకుంటారు. అంటే ఓ సినిమా ఏదైనా డేట్‌న విడుదలై భారీ విజయం అందుకుంటే.. ఆ తర్వాత సినిమాలను వీలైతే ఆ తేదీకి రిలీజ్ చేయాలని చూస్తుంటారు. ఆ తేదీ అన్నిసార్లూ వర్కౌట్ కాదు కానీ.. కొన్నిసార్లు అవుతుంటుంది. అలా వచ్చి విజయాలు అందుకున్న సినిమాలూ ఉన్నాయి. దారుణమైన పరాజయాలు పాలైన సినిమాలూ ఉన్నాయి.
Vijay Devarakonda
అయితే, తాజాగా విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda) ఎదురవుతున్న పరిస్థితి చూస్తుంటే ‘సేమ్ డేనాడు సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ఇంత ఇబ్బందా’ అని అనిపిస్తుంది. కావాలంటే ఆయన ఎక్స్ (మాజీ ట్విటర్)లో చేసిన కొత్త పోస్టు.. దాని కింద వస్తున్న కామెంట్లు చూడండి మీకే పరిస్థితి అర్థమైపోతుంది. ఒక విధంగా విజయ్ జీవితం మారడానికి, తిరిగి ఇబ్బందుల్లోకి వెళ్లడానికి ఆ డేటే కారణం. అదే ఆగస్టు 25. ఆ రోజన చేసిన ట్వీటే ఈ పరిస్థితిక కారణం.
‘వాట్ లగా దేంగే..’ అంటూ ‘లైగర్’ (Liger) సినిమా టైమ్‌లో విజయ్ దేవరకొండ అతి పద్ధతిగా ప్రచారం చేశాడు. దీంతో ఎక్కడ దొరుకుతాడా అని వెయిట్ చేసిన మీమర్స్ సినిమా తేడా కొట్టగానే విరుచుకుపడ్డారు. ఆ ఎఫెక్టో ఏమో ఆగస్టు 25న సినిమా వచ్చి రెండేళ్లు అయినా.. ఎక్కడా దాని గురించి స్పందించలేదు. అయితే ఏడేళ్ల క్రితం అదే రోజున వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ గురించి మాట్లాడాడు.
నిజానికి ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమా గురించి విజయ్ మాట్లాడాలి. ‘లైగర్’ సినిమా మరచిపోవాలి. అయితే రెండూ ఒకే రోజు విడుదల కావడంతో ఇబ్బందులు పడ్డాడు. దీంతో రెండు సినిమాలు ఒకే రోజు రావడం వల్ల ఈ ఇబ్బందులు అని అంటున్నారు. రెండూ వేర్వేరు రోజులు వచ్చి ఉంటే ఈ ట్వీట్ల సమస్య ఉండేది కాదేమో.