నిర్మాత మాట్లాడుతుండగా ఆస్కార్ నిర్వాహకులు చేసిన పనికి ఫైర్ అవుతున్న నెటిజన్లు.. ఏం జరిగిందంటే..?

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూసిన 95వ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే.. ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఇండియన్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. 2023కి గానూ మన దేశం నుంచి ‘ఆల్ దట్ బ్రీత్స్’, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే.. 2023 ఆస్కార్ వేడుక ప్రారంభంలోనే ‘బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్’ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అకాడమీ అవార్డ్ గెలుచుకుంది..

ఏనుగులు, వాటితో మనిషికున్న అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అవార్డు సాధించడం విశేషం. ఓ అనాథ ఏనుగు పిల్ల, దానిని ఆదరించిన దంపతుల కథతో సుమారు 42 నిమిషాల పాటు ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ షార్ట్‌ ఫిలిం.. తాజాగా ఆస్కార్స్‌లో కూడా సత్తా చాటింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కార్తికి గొన్సాల్వేస్ దర్శకత్వం వహించగా.. గునీత్ మోంగా నిర్మించారు.. వేదిక మీద దర్శకురాలు, నిర్మాత ఇద్దరూ అవార్డులు అందుకున్నారు..

అయితే ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రొడ్యూసర్ గునీత్ మోంగాను దారుణంగా అవమానించారంటూ మూవీ లవర్స్, నెటిజన్లు వారి మీద మండి పడుతున్నారు.. అసలేం జరిగిందంటే.. సాధారణంగా ఆస్కార్ అందుకున్న తర్వాత మాట్లాడడానికి విజేతకు 45 సెకన్ల సమయం ఇస్తారు.. ఒకవేళ ఎవరైనా అంతకుమించి మాట్లాడితే వారి స్పీచ్ కట్ చేస్తారు.. అలాగే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కి అవార్డ్ అనౌన్స్ చేసిన తర్వాత డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్ గడువులోగా తన స్పీచ్ ముగించింది..

అయితే ప్రొడ్యూసర్ గునీత్ మోంగా మాట్లాడడం స్టార్ట్ చేసేటప్పటికే మ్యూజిక్ ప్లే చేశారు.. దీంతో ఆమె చెప్పాలనుకున్నది చెప్పకుండానే వేదిక మీద నుంచి వెనుదిరిగారు.. పోనీ అకాడమీ వారు అందరి విషయంలోనూ ఇలానే చేశారా అంటే లేదు.. వీరి తర్వాత బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ అందుకున్న ఛార్లెస్ మాక్సీ, మాథ్యూ ప్రాడ్ ఇద్దరూ కూడా 45 సెకన్ల కంటే ఎక్కువసేపే ప్రసంగించారు కానీ అభ్యంతరం తెలుపలేదు..

ఈ వ్యవహారంపై అమెరికన్ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.. నెటిజన్లు సైతం అకాడమీ భారత్‌ను అవమానించిందంటూ మండిపడుతున్నారు.. 2019లో తొలిసారిగా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నిర్మాత గునీత్ మోంగా ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్’ (Period. End of Sentence) కి ఆస్కార్ అందుకున్నారు.. దీని గురించి నిర్మాత గునీత్ మోంగా స్పందించారు.. ‘‘ఆస్కార్ వేదిక మీద నన్ను మాట్లాడనివ్వకపోవడం షాక్‌కి గురి చేసింది..

ఒక ఇండియన్ షార్ట్ ఫిలింకి ఆస్కార్ రావడం సంతోషం.. ఇంత దూరం వచ్చి ప్రసంగించే అవకాశం ఇవ్వలేదని బాధ కలిగింది.. దీనిపై జనాలు కూడా ఎంతో విచారం వ్యక్తం చేశారు.. ఎంతో మధురమైన క్షణాలను నాకు ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నట్టనిపించింది.. ఇండియాకు వచ్చాక నా సంతోషాన్నిషేర్ చేసుకుంటున్నాను.. నాకు లభిస్తున్న ప్రేమ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారామె..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus