బాలకృష్ణతో నటించనున్న కొత్త నటి
- March 27, 2017 / 01:14 PM ISTByFilmy Focus
తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేయడంలో పూరి జగన్నాథ్ ఎప్పుడూ ముందు ఉంటారు. ఎటువంటి అనుభవం లేనివారితో నటనను రాబట్టుకోవడం అతని స్టైల్. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా అతను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మరో కొత్త బ్యూటీని పరిచయం చేయబోతున్నారు. ఇది వరకు ఏ సినిమాలో నటించని ముస్కాన్ అనే అమ్మాయిని బాలకృష్ణ పక్కన నటింపజేయించనున్నారు. “బాలయ్యకు వంద చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. అతని పక్కన కొత్త నటిని ఎలా ఎన్నుకున్నారు, సమస్యలు రావా” అని డైరక్టర్ ని ప్రశ్నించగా… “బాలకృష్ణ, ముస్కాన్ ని సూపర్ జోడీగా ఎలా చూపించాలో నాకు తెలుసు” అని పూరీ అందరినీ ఆశ్చర్య పరిచారు.
ఇక బాలకృష్ణ తో చేస్తున్న కథను కూడా వెల్లడించారు. ఇదొక మాఫియా నేపథ్యంలో సాగే స్టోరీ అని వివరించారు. ఇందులో పొలిటికల్, ఫ్యాక్షన్ డైలాగులు ఉండవని.. తనదైన మార్కు పంచ్ లు ఉంటాయని స్పష్టం చేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ కి సిద్ధమవుతోంది. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ ఫిలిం సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











