Pooja Hegde: వామ్మో.. పూజా హెగ్డే అంటే వాళ్లకు ఇంత అభిమానమా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే గతేడాది నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం కొత్త కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఈ కారులోనే పూజా హెగ్డే షూట్ కు హాజరు కానున్నారని బోగట్టా. ఇలా కారును కొనుగోలు చేయడం పూజా హెగ్డే విషయంలోనే జరిగింది. పూజా హెగ్డే అంటే చిత్రయూనిట్ కు ఎంత అభిమానమో ఈ ఘటన ద్వారా ప్రూవ్ అవుతోంది. ఈ విషయం తెలిసి పూజా హెగ్డే సైతం తెగ సంతోషిస్తున్నారని సమాచారం అందుతోంది. ఇన్నోవా కొత్త మోడల్ కారును పూజా హెగ్డే కోసం కొనుగోలు చేసినట్టు సమాచారం.

హారిక హాసిని నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో పూజా హెగ్డే హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పూజా హెగ్డే క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక హీరోయిన్ కాగా శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీలీల కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. మహేష్, శ్రీలీల జోడీ బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ లుక్ కొత్తగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus