ప్రకటన ఎక్కువ.. షూటింగ్‌లు తక్కువ.. అంటూ పవన్ కల్యాణ్ సినిమాల మీద ఓ కామెంట్ ఈ మధ్య వినిపిస్తోంది. దానయ్య – సుజీత్ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి ఈ మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ కామెంట్‌ను మళ్లీ కంటిన్యూ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మరో దర్శకుడు మెగా ఫోన్‌తో సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు అతని కోసం త్రివిక్రమ్ ఓ పాయింట్‌ను అనుకున్నారట. అన్నట్లు ఇది పుకారు కాదు.. ఆ డైరక్టరే స్వయంగా చెప్పారు.
రవితేజు ‘రావణాసుర’ చూపించబోతున్న సుధీర్ వర్మనే ఆ దర్శకుడు. తన రాబోయే సినిమా ప్రచారంలో భాగంగా సుధీర్ వర్మ ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా ఉంటుందని, త్వరలోనే వివరాలు బయటకు వస్తాయని సుధీర్ వర్మ చెప్పుకొచ్చారు. ఈ మేరకు త్రివిక్రమ్ ఓ పాయింట్ సిద్ధం చేశారని కూడా చెప్పారు. ఇదంతా తన ‘కేశవ’ సినిమా నుండి జరిగిందని కూడా చెప్పారు.
పవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్ ప్రస్తుతానికి నేరుగా సినిమా చేయకపోయినా.. పవన్ ఇతర చిత్రాలకు స్క్రీన్‌ప్లే, మాటలు తదితర వ్యవహారాలు చూస్తున్నారు. డైరెక్టర్ సాగర్ కె. చంద్ర తెరకెక్కించిన ‘భీమ్లా నాయక్’కు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే అందించారు. ఓ పాట కూడా రాశారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న #PKSDT (వినోదాయ చిత్తాం రీమేక్)కీ ఆయన వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సుధీర్ వర్మకు కథ ఇస్తున్నారు. సుధీర్ వర్మ గతంలో తీసిన ‘కేశవ’ సినిమా త్రివిక్రమ్‌కి నచ్చిందట.
ఓ రోజు ఫోన్ చేసి సుధీర్ వర్మతో ఈ విషయం గురించి మాట్లాడారట. అక్కడికి కొన్ని రోజుల తర్వాత ఓ పాయింట్‌ను నాకు చెప్పి, దానిపై సినిమా చేయాలన్నారట. ఆ పాయింట్ ఆధారంగా పవన్ కల్యాణ్‌కు తాను చెప్పిన ఐడియా నచ్చిందని సుధీర్ వర్మ చెప్పారు. పవన్ ఇప్పుడు చేస్తున్న, చేయాలనుకుంటున్న సినిమాల తర్వాత ఇది వస్తుందా? లేక మధ్యలోకి వస్తుందా అనేది చూడాలి. హారిక హాసిని బ్యానర్ మీద వచ్చిన ‘అజ్ఞాతవాసి’ దారుణ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?