‘హిట్‌ వెర్స్‌’ మూడో పార్టుకే ఇంత చేస్తున్నారంటే..?

‘హిట్‌ 2’ సందడి ఓవైపు నడుస్తుంటే.. ‘హిట్‌ 3’ ముచ్చట్లు మొదలయ్యాయి. సినిమా ఆఖరులో నాని ‘అర్జున్‌ సర్కార్‌’గా వచ్చి మూడో సినిమా మీద అంచనాలు పెంచాడు. అయితే సినిమా ఎప్పుడు, ఎలా, ఏంటి? అనే సంగతులు ఇంకా చెప్పలేదు. అప్పుడే మనం కంగారు కూడా పడలేం. అయితే ఇదంతా ఓవైపు జరుగుతుంటే మరోవైపు ఈ సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అంటూ రకరకాల పుకార్లు వచ్చేస్తున్నాయి. సినిమాలో నాని ఒక్కడే కనిపిస్తాడా? లేక ఇంకా ఎవరైనా అంటూ లెక్కలేసేస్తున్నారు.

అందులో భాగంగా ఇప్పటివరకు బయటకు వచ్చిన పుకార్లు చూస్తే.. ఇవి నిజమైతే బాగుండు అనే ఆలోచన ప్రేక్షకులకు కలుగుతుంది. అంత బాగున్నాయి ఆ పుకార్లు. అందులో తొలుతది విజయ్‌ సేతుపతి. ఈ విషయం ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ‘హిట్‌ 3’లో ఆయన విలన్‌గా నటిస్తాడు అని అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ లేదని ముందే చెప్పాం. తాజాగా వినిపిస్తున్న పుకారు. ‘హిట్‌ 3’ పేరుకు తగ్గట్టు ముగ్గురు హీరోలు ఈ సినిమాలో ఉంటారు అని.

అంటే నానితోపాటు మరో ఇద్దరు హీరోలు కనిపిస్తారట. ఇది నమ్మడానికి కాస్త కష్టమైనా.. నమ్మక తప్పని మాట అంటున్నారు. ఆ ఇద్దరు హీరోలు కూడా ఇప్పటికే ‘హిట్‌’ చేసిన వాళ్లట. ‘హిట్‌’ చేసిన విశ్వక్‌ సేన్‌, ‘హిట్‌ 2’ చేసిన అడివి శేష్‌ మూడో ‘హిట్‌ 3’లో కూడా ఉంటారట. అయితే ముగ్గరూ కలసి సినిమా చేయరట. సినిమాలోని కీలక సమయంలో ఇద్దరూ విడివిడిగానో లేక కలిసో వస్తారట. అలా సినిమాలో కీలక కేమియోలు చేయడానికి విశ్వక్‌సేన్‌, అడివి శేష్‌ సిద్ధమయ్యారట.

నిజానికి ఈ పుకారు ఆ టీమ్‌ చేసిన ఓ పోస్ట్‌ నుండి వచ్చినదే. విశ్వక్ సేన్‌, నాని, అడివి శేష్ కలసి దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు దర్శకుడ శైలేష్ కొలను. ‘హిట్ 3’ కోసం పెద్ద ప్లానే వేస్తున్నామంటూ ట్వీట్ చేశారు. క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ.. ఏదో భారీగానే ప్లాన్‌ చేస్తున్నారని అర్థమవుతోంది. చూద్దాం ‘హిట్‌ 3’ ఏం చేస్తుందో.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus