రామ్ (Ram) హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) ఫేమ్ పి.మహేష్ బాబు (Mahesh Babu P) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గోదావరి బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ డ్రామా ఇది. ‘ఒక ఊరు బాగు కోసం సాగర్ అనే కుర్రాడు ఏం చేశాడు?’ అనే లైన్ తో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ కూడా ఉంటాయని సమాచారం. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కథ ప్రకారం ఇందులో హీరోతో సమానమైన పాత్ర ఒకటి ఉంటుందట. ఈ పాత్ర కోసం ఇప్పటికే సీనియర్ హీరోలైన బాలకృష్ణ (Nandamuri Balakrishna), రజినీకాంత్ (Rajinikanth), అరవింద్ స్వామి (Arvind Swamy) .. వంటి వాళ్ళను టీం సంప్రదించడం జరిగిందట. ఒక దశలో మోహన్ లాల్ (Mohanlal) ఫిక్స్ అయినట్లు టాక్ నడిచింది. కానీ ఆయన రోజుకు రూ.1 కోటి చొప్పున పారితోషికం డిమాండ్ చేశారని.. అందుకే టీం ఆయన్ని హోల్డ్ లో పెట్టినట్టు టాక్ నడిచింది. తర్వాత ఉపేంద్రని (Upendra Rao)అప్రోచ్ అవ్వడం..
అతను ఒక దశలో ఓకే చెప్పినట్టు చెప్పి.. చివరికి అతను కూడా రిజెక్ట్ చేసినట్లు టాక్. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతిని టీం అప్రోచ్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘మైత్రి’ బ్యానర్లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ‘ఉప్పెన’ (Uppena) చేశారు. అది మంచి విజయం అందుకుంది.ఆ చనువుతో మైత్రి వారు సేతుపతిని సంప్రదించారు. కానీ ఇప్పుడైతే విజయ్ సేతుపతి విలన్ రోల్స్ చేయడానికి ఆసక్తిగా లేరు. హీరోగా సినిమాలు చేయాలని చూస్తున్నారు. చూడాలి మరి ఆయన రామ్ సినిమాకు ఓకే చెబుతారో లేదో.