డైరెక్టర్ల సక్సెస్ రేట్ తో, అనుభవంతో పని లేకుండా ఛాన్స్ ఇచ్చే విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. తొలి సినిమాతో హిట్ సాధించిన ఎంతోమంది డైరెక్టర్లకు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. పవన్ తో కిషోర్ కుమార్ పార్థసాని(డాలీ) గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలను తెరకెక్కించారు. ఈ సినిమాలలో గోపాల గోపాల హిట్ గా నిలిస్తే కాటమరాయుడు యావరేజ్ గా నిలిచింది.
అయితే ఈ సినిమాల తర్వాత డాలీకి కొత్త సినిమా ఆఫర్లు అయితే రాలేదు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన వేణుశ్రీరామ్ నానితో ఎంసీఏ సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించారు. ఎంసీఏ సినిమా సక్సెస్ తో వేణు శ్రీరామ్ కు పవన్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాకు డైరెక్షన్ చేసే ఛాన్స్ దక్కింది. వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఏపీ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ సినిమా భారీస్థాయిలో కలెక్షన్లను సాధించింది.
అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ పేరుతో వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వచ్చినా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరోవైపు భీమ్లా నాయక్ సినిమాతో సాగర్ కె చంద్ర ఖాతాలో హిట్ చేరిందనే సంగతి తెలిసిందే. ఈ ఏడాదే విడుదలైన భీమ్లా నాయక్ అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే భీమ్లా నాయక్ సక్సెస్ అయినా సాగర్ కె చంద్రకు కొత్త సినిమా ఆఫర్లు అయితే దక్కలేదు.
పవన్ టాలెంట్ ను నమ్మి అవకాశాలు ఇస్తున్నా ఇతర స్టార్ హీరోలు మాత్రం ఈ డైరెక్టర్లకు అవకాశాలను ఇవ్వడం లేదు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్లు తమ కొత్త ప్రాజెక్టులను ఎప్పుడు మొదలుపెడతారో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!