Sai Dharam Tej: సాయి తేజ్ ఖాతాలో అరుదైన రికార్డు.. ఏంటో తెలుసా?

మెగా మేనల్లుడు సాయి తేజ్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మన తెలుగు సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న సంగతి తెలిసిందే.అక్కడి జనాలు వీటిని తెగ వీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో 100 మిలియన్లకు పైనే వ్యూస్ నమోదవుతున్న రికార్డులు ఎన్నో మనం చూస్తూనే వస్తున్నాం. విచిత్రం ఏంటంటే తెలుగులో ప్లాప్ అయిన సినిమాలను కూడా అక్కడి జనాలు ఎగబడి చూస్తున్నారు. అయితే సాయి తేజ్ నటించిన 3 సినిమాలకు వ్యూస్ తో పాటు 1 మిలియ‌న్ లైక్స్ కూడా నమోదవ్వడం సరికొత్త రికార్డుగా చెప్పుకోవాలి.

సాయి తేజ్ హీరోగా కరుణాకరన్ డైరెక్షన్లో ‘తేజ్ ఐ ల‌వ్ యూ’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.దీనిని ‘సుప్రీమ్ ఖిలాడీ -2’ పేరుతో హిందీలో డ‌బ్ చేసారు.ఈ చిత్రానికి 222 మిలియన్ వ్యూస్ మరియు 1.3 మిలియన్ లైక్స్ నమోదయ్యాయి. అలాగే ‘ప్ర‌తి రోజూ పండ‌గే’ చిత్రాన్ని ‘హ‌ర్ దిన్ దివాలీ’ పేరుతో డ‌బ్ చేశారు.దీనికి ఇప్పటివరకు 83 మిలియన్ వ్యూస్ అలాగే 1.1 మిలియన్ లైక్స్ నమోదయ్యాయి.

తాజాగా ఈ లిస్ట్ లో సాయితేజ్- కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కిన ‘చిత్ర‌ల‌హ‌రి’ కూడా జాయిన్ అయ్యింది.ఈ చిత్రం హిందీ వ‌ర్ష‌న్ ను ‘ప్రేమ‌మ్’ గా డబ్ చేసి అప్లోడ్ చేయగా 102 మిలియన్ వ్యూస్, 1మిలియన్ లైక్స్ నమోదయ్యాయి. మూడు సినిమాలతో 1 మిలియన్ లైకులు సాధించిన తెలుగు హీరోగా సాయి తేజ్ రికార్డు సృష్టించాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus