బాలీవుడ్ చాలా గడ్డు కాలంలో ఉంది. గత 4 నెలల్లో అక్కడ రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. స్టార్ హీరోల సినిమాలు కూడా వీకెండ్ కే దుకాణం సర్దేస్తున్నాయి. నాలుగైదు సార్లు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరో.. ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రంతో హిట్టు కొట్టలేకపోయాడు. ఆ మూవీ ఎపిక్ డిజాస్టర్ గా మిగిలింది. ఈ క్రమంలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కొంత ఊరటని ఇచ్చింది.
అలా అని ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకున్న మూవీ కాదు. కానీ రూ.350 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కాబట్టి.. జనాలను ఆకట్టుకునే కథా కథనాలతో సినిమా కనుక తీస్తే కచ్చితంగా జనాలు థియేటర్లకు వస్తారని ఈ మూవీ ప్రూవ్ చేసింది. అంతేకాదు సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే రోజున ఈ చిత్రం టికెట్ రేట్లు బాగా తగ్గించారు. ఆ రోజు మల్టీప్లెక్సుల్లో రూ.112 కే ‘బ్రహ్మాస్త్ర’ టికెట్ రేటు ఉంది. ఈ క్రమంలో మొదటి రోజున మించి టికెట్లు సేల్ అయ్యాయి.
దీంతో బ్రహ్మాస్త్ర టీం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 26(ఈరోజు) నుండి సెప్టెంబర్ 29 వరకు మల్టీప్లెక్సుల్లో ‘బ్రహ్మాస్త్ర’ కి రూ.100 టికెట్ రేటు పెట్టాలని డిసైడ్ అయ్యింది. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఇందుకు అంగీకరించకపోవడంతో ఫైనల్ గా రూ.112 టికెట్ రేటు పెట్టింది.
ఈరోజు కూడా ఈ చిత్రం బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ‘బ్రహ్మాస్త్ర’ టీం మంచి నిర్ణయమే తీసుకుంది. ఒకవేళ ఈ ఫార్ములా సక్సెస్ అయితే రాబోయే సినిమాలకు కూడా ఓ దారి చూపించినట్టు అవుతుంది. రాబోయే సినిమాలకు అనే కాదు నార్త్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ ఫార్ములాని పాటించే అవకాశం ఉంది.
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!