Balayya Babu: బాలయ్య 108వ సినిమాలో కొత్త సెంటిమెంట్‌… ఈసారి అదే మ్యాజిక్‌!

బాలకృష్ణ సినిమాలు మాస్‌ మసాలాతో నిండి ఉంటాయి. అయితే ఒక విషయం మాత్రం అంతర్లీనంగా రన్‌ అవుతూ ఉంటుంది. అదే సెంటిమెంట్‌. దాదాపు ప్రతి సినిమాలో ఓ సెంటిమెంట్‌ని చూపిస్తూ ఉంటారు. తల్లి, కూతురు, తండ్రి, అన్నదమ్ములు… ఇలా ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. తాజాగా ఆయన చేస్తున్న 108వ సినిమాలో కూడా ఇలాంటి పనే చేస్తున్నారు. ఈ సారి ఆయన కొడుకు సెంటిమెంట్‌ను తీసుకొస్తున్నారు అని చెబుతున్నారు.

నిజానికి బాలకృష్ణ సినిమాల్లో కొడుకు సెంటిమెంట్‌ దాదాపుగా ఉంటుంది. అయితే తండ్రి పాత్రను సెకండాఫ్‌లో తీసుకొస్తుంటారు. దాని వల్ల స్పెషల్‌ ఎలిమెంట్‌ను సినిమాలో యాడ్‌ చేసినట్లు అవుతుంటుంది. అయితే ఈసారి సినిమా మొత్తం అదే సెంటిమెంట్‌తో నడుపుతారు అని చెబుతున్నారు. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కేఎస్‌ రవీంద్ర (బాబీ) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలోనే ఇది జరగబోతోంది.

ఎమోషనల్ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రధానంగా తండ్రీ కొడుకుల నేప‌థ్యంలో తెర‌కెక్కే సన్నివేశాలే ఆకర్షణీయంగా ఉంటాయి అని చెబుతున్నారు. ఈ మేరకు ఫ్లాష్ బ్యాక్‌ ఉంటుంది అని కూడా అంటున్నారు. అలాగే సినిమా కథ ముగింపు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని తెలుస్తోంది. మరి ఇందులో కొడుకుగా ఎవరు నటిస్తారు అనేది తెలియాల్సి ఉంటుంది. రెండు పాత్రల్లో బాలయ్య ఉంటాడు అని చెప్పినా… అది కీలకమైన కొడుకు పాత్రేనా అనేది తెలియాల్సి ఉంది.

కొన్ని రోజులు క్రితం ఈ సినిమాలో మరో యంగ్‌ హీరోకు స్థానం ఉంది అని వార్తలొచ్చాయి. దాని కోసం యంగ్‌ హీరోల్లో ఒకరిని తీసుకుంటారు అని కూడా చెప్పారు. మరి ఆ పాత్ర ఇదేనా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఆ కొడుకు పాత్ర మరీ చిన్నోడు అయితే యువ నటుల్ని ఎంచుకునే అవకాశం ఉంది. చూడాలి మరి దర్శకుడి ఆలోచన ఎలా ఉంది అనేది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు అనేది మరో రూమర్‌.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus