కరోనా వైరస్ ఇతర ఇండస్ట్రీలను ఏ స్థాయిలో దెబ్బకొట్టిందో అంతకుమించి అనేలా తెలుగు సినిమా ఇండస్ట్రీలను కోలుకోలేని దెబ్బ కొట్టింది. కరెక్ట్ గా టాలీవుడ్ లో వరుస పాన్ ఇండియా సినిమాలు బిగ్ బడ్జెట్ సినిమాలు తెరపైకి వస్తున్న సమయంలోనే కరోనా ఊహించని షాక్ ఇచ్చింది. ఈపాటికే రెండు మూడు పాన్ ఇండియా సినిమాలు తెలుగులోనే రిలీజ్ అయ్యేవి. ఇక మొత్తానికి పరిస్థితులు నార్మల్ అవుతున్న సమయంలో కొత్త రకం వైరస్ మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ ప్రస్తుతం కొన్ని ప్రముఖ దశల్లో మెల్లగా తన బలాన్ని పెంచుకుంటోంది. దాని తీవ్రత రెగ్యులర్ వైరస్ కంటే కూడా ఆరు రేట్లు ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరిస్తోంది. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండవచ్చని కూడా అంటున్నారు. ఇక ఆ ప్రభావం తెలుగు చిత్రపరిశ్రమపై ఎక్కువగానే చూపించే అవకాశం ఉంది. డిసెంబర్ మీడ్ నుంచి ఫిబ్రవరి వరకు విడుదలయ్యే సినిమాలు మళ్ళీ వాయిదా పడవచ్చని అంటున్నారు.
ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ కూడా వాయిదా పడటం వెనుక ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ట్రైలర్ కు సినిమా విడుదలకు గ్యాప్ ఎక్కువగా ఉండాలి కాబట్టి మళ్ళీ సినిమా వాయిదా వేస్తే ముందుగా సినిమా ట్రైలర్ రిలీజ్ కావద్దని ఆలోచించారట. ఇక వైరస్ తీవ్రత ఎక్కువైతే పుష్ప, రాధేశ్యామ్ వంటి సినిమాలు వాయిదా పడే అవకాశం ఉంది.