Prabhas: బెల్లంకొండ ఛత్రపతి విషయంలో కీలక నిర్ణయం.. ఏమైందంటే?

ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడంతో పాటు అటు ప్రభాస్ ఇటు రాజమౌళి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చాయనే సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటోంది. ప్రభాస్ కు మాస్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ రావడానికి ఈ సినిమా కూడా ఒక కారణమని చెప్పవచ్చు.

అయితే ఛత్రపతి సినిమా హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అదే టైటిల్ తో హిందీలో రీమేక్ అయింది. వి.వి. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మే నెల 12వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది. హిందీ ఛత్రపతి ప్రమోషనల్ మెటీరియల్ కు అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు హిందీలో బాగానే బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఛత్రపతి సినిమా తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేయవచ్చని కామెంట్లు వినిపించాయి. గతంలో తెలుగు నుంచి రీమేక్ అయ్యి మళ్లీ తెలుగులో విడుదలైన సినిమాల వల్ల ఈ తరహా ప్రచారం జరిగింది. అయితే ఛత్రపతి తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడం లేదని హిందీలో మాత్రమే ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఈ విధంగా చేయడం వల్ల (Prabhas) ప్రభాస్ ఫ్యాన్స్ కు టెన్షన్ తగ్గిందనే చెప్పాలి.

బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి టీజర్ కు 11 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే బెల్లంకొండ శ్రీనివాస్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగుండదని చెప్పవచ్చు. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక హిందీ వెర్షన్ అక్కడ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. బెల్లంకొండ శ్రీనివాస్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో విజయాలు దక్కాలని తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus