బాహుబలి2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఘనవిజయం సాధించాయి. ఈ సినిమాలకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించాయి. ఈ సినిమాలు సాధించిన కలెక్షన్లను ఇప్పట్లో మరో సినిమా బ్రేక్ చేయడం కష్టమనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలు సక్సెస్ కావడానికి కథ, కథనంగా అద్భుతంగా ఉండటం ఒక కారణమని చెప్పవచ్చు. ఈ సినిమాలలోని ఎలివేషన్ సీన్లు, యాక్షన్ సీన్లు ప్రేక్షకుల ఊహను మించి ఉన్నాయి.
ఈ సినిమాలలోని కొన్ని సన్నివేశాలు ఇలా కూడా తీయవచ్చా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలను చూసి మెచ్చుకున్న ప్రేక్షకులు సాధారణ కథలతో తెరకెక్కిన సినిమాలను ఆదరించడం లేదు. ఈ మధ్య కాలంలో పలు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడానికి ఇదే కారణం కావడం గమనార్హం. అదే సమయంలో టాలీవుడ్ రచయితలు, దర్శకులు ఈ ఇండస్ట్రీ హిట్ సినిమాలను మించిన కథ, కథనాలతో కొత్త కథలను రాయగలమా తీయగలమా అని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
స్టంట్ మాస్టర్లు సైతం కేజీఎఫ్2 సినిమాను మించిన స్టంట్స్ ను చేయడం సాధ్యమవుతుందా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేజీఎఫ్2 సినిమా చూసిన తర్వాత కొంతమంది రచయితలు ఐదారు రోజులు ఏం రాయాలో అర్థం కాక సైలెంట్ గా ఉన్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అదే సమయంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్, సలార్, మహేష్ జక్కన్న కాంబో మూవీ మరికొన్ని సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలన్నీ 300 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకుని బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకుంటాయేమో చూడాల్సి ఉంది.