ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు (Allu Arjun) గత కొన్నేళ్లుగా ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ఊహించని విధంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (Naa Peru Surya, Naa Illu India) సినిమా బన్నీ కెరీర్ లో భారీ ఫ్లాప్ గా నిలవగా అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramulo) సినిమా నాన్ బాహుబలి (Baahubali) ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా ఈ సినిమాకు సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) సినిమాతో గట్టి పోటీ ఎదురైంది. సోలో రిలీజ్ దక్కి ఉంటే అల వైకుంఠపురములో కలెక్షన్లు మరింత పెరిగేవని ఫ్యాన్స్ భావిస్తారు.
పుష్ప ది రైజ్ (Pushpa) రిలీజ్ సమయంలో టికెట్ రేట్ల సమస్య వల్ల బన్నీ సినిమాకు ఏపీలోని కొన్ని ఏరియాలలో నష్టాలు వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఏపీలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు ఒకింత షాకిచ్చింది. పుష్ప ది రూల్ (Pushpa 2) సినిమా టార్గెట్ 1000 కోట్ల రూపాయలు కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టార్గెట్ ను బన్నీ సాధించడం సులువైన విషయం అయితే కాదు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు వస్తుందో రాదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో ఈ సినిమా విషయంలో ఎలా వ్యవహరిస్తారనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం. పుష్ప ది రూల్ సినిమా బడ్జెట్ పరంగా అత్యంత భారీ మూవీ అనే సంగతి తెలిసిందే. పుష్ప2 సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
పుష్ప ది రూల్ రిలీజ్ సమయానికి పవన్ బన్నీ మధ్య గ్యాప్ తగ్గి ఈ పరిస్థితి మారుతుందేమో చూడాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం అనే సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రత్యేకంగా ఉంటాయని బాక్సాఫీస్ వద్ద పుష్ప2 పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. డిసెంబర్ నెల 6వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.