Rajamouli: తన సినిమాలే రాజమౌళికి కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయా?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన డైరెక్టర్లు తర్వాత సినిమాలతో ఆ అంచనాలను మించిన విజయాలను అందుకోవాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడి వల్లే కొంతమంది డైరెక్టర్లు ఒకప్పుడు వరుస విజయాలను సొంతం చేసుకున్నా తర్వాత రోజుల్లో ఆ అంచనాలను అందుకునే విషయంలో తడబడుతున్నారు. అయితే బాహుబలి, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ లతో జక్కన్నకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ పెరిగింది. గత పదేళ్లలో జక్కన్న తెరకెక్కించిన సినిమాలు మూడే అయినా ఆయన బ్రాండ్ నేమ్ మాత్రం ఊహించని రేంజ్ లో పెరిగింది.

అయితే మహేష్ మూవీ విషయంలో జక్కన్నకు ఒకింత టెన్షన్ ఉందని తెలుస్తోంది. సినిమా రిజల్ట్ కు సంబంధించి సందేహం లేకపోయినా గత సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం జక్కన్నను టెన్షన్ పెడుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. తన సినిమాలే రాజమౌళికి కొత్త సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో జక్కన్న ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకుంటారో చూడాల్సి ఉంది. మార్చి నెల నుంచి మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ కు వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అధికారికంగా ఈ వార్తల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. మహేష్ జక్కన్న బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది. 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేష్ కు జోడీగా హాలీవుడ్ బ్యూటీని ఈ సినిమాలో తీసుకోనున్నారని తెలుస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉండనుందని హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాలో ఉంటాయని సమాచారం.

ఇతర దేశాల ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజమౌళి ఈ సినిమా కోసం 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోనున్నారని ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus