‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాకు సంబంధించి సినిమా టీమ్ కంటే, హీరో కంటే హీరోయినే ఎక్కువగా మాట్లాడుతోందా? ఏమో ఆమె పోస్టులు, ఇంటర్వ్యూల్లో సినిమా గురించి ఎక్కువగా చెబుతోంది అనిపిస్తోంది. ఇప్పటికే సినిమా గురించి చాలాసార్లు చెప్పిన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) .. ఇప్పుడు మరోసారి సినిమా గురించి మాట్లాడింది. దీంతో ‘హరి హర వీరమల్లు’ను వీర లెవల్‌లో లేపుతున్న నిధి అగర్వాల్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మార్చి 28న ‘హరి హర వీరమల్లు’ సినిమాను రిలీజ్ చేస్తామని టీమ్ ఇప్పటికీ చెబుతోంది.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన పాట రిలీజ్ పోస్టర్‌లో కూడా సినిమా రిలీజ్ డేట్‌ను చెప్పారు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా నిధి అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో ఎన్నో మలుపులు ఉంటాయని కూడా చెప్పింది. ‘హరి హర వీరమల్లు’ సినిమాలోని కొన్ని మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని, కథ చాలా వేగంగా ఉంటుంది అని చెప్పింది నిధి అగర్వాల్.
అంతేకాదు ఇన్నాళ్లు సినిమాలో కీలకం అని చెబుతూ వచ్చిన ఔరంగజేబు ట్రాక్ సినిమా ఒక భాగం మాత్రమే అని చెప్పింది. సినిమా ఆ ట్రాక్ మీదనే ఆధారపడి ఉండదు అని కూడా చెప్పింది. తన పాత్ర విషయానికొస్తే కేవలం పాటలకు పరిమితమయ్యే సగటు హీరోయిన్ కాదు అని చెప్పింది. ఇక పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటన చూసి ఒక్కోసారి ఆశ్చర్యపోయేదానినని, ఎంత కష్టమైన సన్నివేశం అయినా మూడు నిమిషాల్లో నటించేస్తారు అని చెప్పిందామె.
ఇక ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్‌తో ఉన్న పాటలు కూడా ఉన్నాయి అని చప్పింది. ఫైనల్‌గా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది అని చెప్పింది నిధి అగర్వాల్. ఈ సినిమాలో ఆమె పంచమి అనే యువరాణి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ (Spirit) పేరుతో వస్తోంది.