మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రాజెక్టులపై తరచూ కొత్త కథనాలు బయటకు వస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని నిజం, కొన్ని ఊహాగానాలే. తాజాగా బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో చరణ్ ఓ మైథలాజికల్ డ్రామా చేస్తున్నాడనే వార్త వైరల్ అయింది. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్వయంగా నిఖిల్ భట్ క్లారిటీ ఇచ్చారు. తన తదుపరి ప్రాజెక్ట్ యాక్షన్ నేపథ్యంలో ఉంటుందని, కానీ అది చరణ్‌తో కాదని స్పష్టంగా పేర్కొన్నాడు.
దీనితో ఈ రూమర్‌కు ముగింపు పడింది. అయితే టాలీవుడ్ వర్గాల్లో చరణ్ కొత్త డైరెక్టర్లతో కథలపై చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రామ్ చరణ్ ‘RC16’ (RC 16 Movie) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతోంది. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తోంది. మరోవైపు, సుకుమార్‌తో (Sukumar) ‘RC17’ ప్రాజెక్ట్ కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది.
రంగస్థలం (Rangasthalam) తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని టాక్. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) తర్వాత రామ్ చరణ్ తన ప్రాజెక్ట్స్ ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మరోవైపు, కొత్త దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ స్పెక్యులేషన్లకు ఫుల్ స్టాప్ పెట్టి, చరణ్ తదుపరి సినిమాపై అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి.