Nidhhi Agerwal, Prabhas: ఆ ఒక్క కారణంతో ప్రభాస్ సినిమా నుండి నిధి తప్పుకుంటుందా..!

ప్రభాస్ ఒప్పుకున్న వరుస సినిమాల్లో దర్శకుడు మారుతి మూవీ కూడా ఒకటి. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటనలు ఏమీ లేకపోయినా.. సైలెంట్ గా పూజా కార్యక్రమాలు జరిగిపోయాయి, రెండు వారాల షూటింగ్ కూడా జరిగింది. మొదట ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారంటూ ప్రకటన వచ్చింది. కానీ దానయ్య ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు.

ఈ మూవీలో కొంచెం హర్రర్ టచ్ ఉంటుందని కూడా వినికిడి. ప్రభాస్ ఓ దెయ్యంలా కనిపిస్తాడు అనే వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుంది అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభాస్ కు జోడీగా ఎవరు నటిస్తారు అన్నది అలా ఉంటే.. ఈ సినిమా కథ ప్రకారం ముగ్గురు హీరోయిన్లు అవసరం ఉందట. ఇందులో ‘మాస్టర్’ బ్యూటీ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ‘రాధే శ్యామ్’ బ్యూటీ రిద్ధి కుమార్ నటిస్తారంటూ కథనాలు వినిపించాయి.

ఈ ముగ్గురు ఫిక్స్ అని చిత్ర బృందం కూడా తెలిపింది. కానీ ఇప్పుడు నిధి అగర్వాల్ తప్పుకోబోతుంది అని సమాచారం. ఎందుకంటే ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం నిధికి లుక్ టెస్ట్ చేయగా.. ఆమె మ్యాచ్ అవ్వలేదు అని వినికిడి. దీంతో మారుతి.. నిధిని లైట్ తీసుకోవాలి అనుకుంటున్నాడట. జనవరిలో ఈ చిత్రం షూటింగ్లో భాగంగా ఓ ఇంపార్టెంట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అప్పటికి నిధి విషయంలో క్లారిటీ వస్తుంది అని సమాచారం.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus