కరోనా లాక్డౌన్ టైంల చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. దిల్ రాజుతో మొదలుపెడితే నిఖిల్,నితిన్,రానా, కాజల్ వంటి వారు ఈ లాక్ డౌన్ టైంలోనే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఈ లిస్టు లో నే మెగా డాటర్ నిహారిక కూడా ఉంది. అయితే ఆమె వివాహం డిసెంబర్ 9న జరగబోతుంది. గుంటూరు ఐ.జి ప్రభాకర్ రావు కొడుకు అయిన చైతన్య జొన్నలగడ్డ తో నిహారిక వివాహం జరగబోతుంది.
రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్లో నిహారిక వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. డెస్టినేషన్ వెడ్డింగ్ గా నిహారిక పెళ్లి జరగబోతుంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే నిహారిక, చైతన్య ల వివాహం జరగబోతుంది. అటు తరువాత డిసెంబర్ 11న హైదరాబాదులో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక నిహారిక కొణిదెల- చైతన్యల వివాహ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెప్పాలంటే పెళ్లి చాలా సింపుల్ గా చేస్తున్నప్పటికీ కార్డు మాత్రం కాస్ట్ లీ గానే కనిపిస్తుంది.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుంది కాబట్టి… తక్కువ కార్డులు డిజైన్ చేయించినా రిచ్ లుక్ లో ఉండేలా చూసుకున్నారు అని తెలుస్తుంది. ఇక నిహారిక వెడ్డింగ్ పనులు మొత్తం తన అన్నయ్య అలాగే నాగబాబు పెద్ద కొడుకు అయిన వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడు.