Niharika: ఆ నెగిటివ్ కామెంట్ల గురించి నోరు విప్పిన నిహారిక.. వాళ్లకు షాకిస్తూ?

మెగా డాటర్ నిహారిక ఈ మధ్య కాలంలో వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన నిహారిక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ లోని పాత్ర ఎంతో డిఫికల్ట్ గా ఉందని ఆమె అన్నారు. నేను తప్పు చేసినా అది తప్పని ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చే ఆమ్మాయిగా కనిపిస్తానని నిహారిక తెలిపారు.నేను పబ్జీ గేమ్ ను చాలా ఇష్టపడ్డానని ఆమె కామెంట్లు చేశారు.

డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ లోని గాయత్రి పాత్ర ఎక్కువగా నవ్వదని షూటింగ్ తొలిరోజుల్లో కొన్నిసార్లు ఎక్కువ టేక్స్ తీసుకున్నానని నిహారిక వెల్లడించారు. రియల్ లైఫ్ లో నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటానని ఆమె తెలిపారు. పుష్ప2లో నేను నటిస్తున్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని నిహారిక అన్నారు. ఆ మూవీలో ఛాన్స్ నా దృష్టికి వస్తే నేను చెబుతానని ఆమె క్లారిటీ ఇచ్చారు.నేను సినిమాల కోసం, ఓటీటీల కోసం పని చేశానని నిహారిక అన్నారు. యాక్టింగ్ చేయడాన్ని నేను ఎంతగానో ఇష్టపడతానని ఆమె పేర్కొన్నారు.

దిస్ ఈజ్ అజ్ వెబ్ సిరీస్ అనే ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ను నేను చాలా ఇష్టపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లను చూడనని ఒక ఫేస్ లెస్ పర్సన్ కు మీ మూడ్ మార్చి హర్ట్ చేసే పవర్ ఎందుకు ఇవ్వాలని ఆమె అన్నారు. ఓన్ ప్రొడక్షన్ బెటరా? అదర్ ప్రొడక్షన్ బెటరా అనే ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ నేను నా ఓన్ ప్రొడక్షన్ లో బిగ్గర్ ప్రాజెక్ట్స్ చేయలేదని ఆమె తెలిపారు. తమడా మీడియాలో పని చేయడం ఎంజాయ్ చేశానని నిహారిక పేర్కొన్నారు.

నేను జోక్స్ ను ఇష్టపడతానని (Niharika) ఆమె అన్నారు. సైరా సినిమాకు సంబంధించి వచ్చిన మీమ్స్ ను సేకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని నిహారిక అన్నారు. సింహరాశి సినిమాలో మెరుపుతీగలా సైరా సినిమాలో నేను కనిపించానని మీమ్స్ చేశారని ఆమె తెలిపారు. నేను వర్కౌట్లు ఎక్కువగా చేస్తానని నిహారిక పేర్కొన్నారు. నేను అన్నీ తింటానని నిహారిక చెప్పుకొచ్చారు. డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ను తమడా మీడియా, బీబీసీ స్టూడియోస్ ఇండియా నిర్మించాయి. మే నెల 19వ తేదీన డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus