Niharika: కొత్త అనుమానాలకు తావిచ్చిన మెగా డాటర్….!

వెబ్ సిరీస్ లతో కెరీర్ ను మొదలు పెట్టిన నిహారిక అటు తర్వాత బుల్లితెర పై పలు షోలకి మెంటర్ గా వ్యవహరిస్తూనే … ఆ తర్వాత హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.నాగశౌర్య హీరోగా నటించిన ‘ఒక మనసు’ తో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో ఈమె నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ వంటి సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు.ఆ తర్వాత మళ్ళీ వెబ్ సిరీస్ ల బాట పట్టింది.

ఆ తర్వాత ఏడాది అంటే 2020 చివర్లో చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను స్టార్ట్ చేసింది. తర్వాత సినిమాలు మానేసినా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ వస్తుంది. అయితే మొన్నామధ్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాని డిలీట్ చేసి వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు. ట్రైనర్ తో ఈమె చేసిన జిమ్ వర్కౌట్లకి గాను ట్రోలింగ్ జరగడంతో ఆమె అలా చేసింది అని అంతా అనుకున్నారు.

కొన్నాళ్ళకి పోలీసులు రైడ్ చేసిన పబ్ లో ఈమె దొరికింది. ఆ పబ్ లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడ రైడ్ చేశారు. అక్కడ నిహారిక దొరికినా తన తప్పు ఏమీ లేదు అంటూ అతని తండ్రి నాగబాబు వెనకేసుకొచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఆమె ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యింది అని అంతా అనుకుంటున్నారు.

తాజాగా ఈమె జిమ్ ట్రైనర్ తో చేసిన వర్కౌట్ల వీడియోని డిలీట్ చేసింది. అంటే ఆ వీడియో వల్ల ఈమె ఫ్యామిలీ లైఫ్ కు ఏదో ఇబ్బంది కలిగి ఉండొచ్చు అని అంతా అనుకుంటున్నారు. మరోపక్క ఇటీవల ఆమె నిర్మాతగా ఓ వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యింది. దాని ప్రారంభోత్సవానికి నిహారిక భర్త చైతన్య కూడా హాజరయ్యాడు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus