Niharika: బావ కోసం ఆ పని చేశానన్న నిహారిక.. ఏం చెప్పారంటే?

  • May 15, 2023 / 12:25 PM IST

మెగా డాటర్ నిహారికకు ప్రేక్షకుల్లో రోజురోజుకు క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న నిహారిక ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లతో బిజీ అవుతూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. నిహారిక నటించిన డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. మెగా హీరోలు కాకుండా నచ్చిన హీరో ఎవరనే ప్రశ్నకు నిహారిక ఎన్టీఆర్ పేరు సమాధానంగా చెప్పింది.

జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ పర్ఫామర్ అని ఆమె కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్ అని ఈ రీజన్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఇష్టమని నిహారిక పేర్కొన్నారు. తారక్ నటించిన ప్రతి మూవీ చూస్తానని నిహారిక వెల్లడించారు. నిహారిక చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ వస్తే నిహారిక నటించాలని అభిమానులు చెబుతున్నారు.

తనకు హర్రర్ సినిమాలు అంటే భయమని నిహారిక పేర్కొన్నారు. అయితే సాయితేజ్ బావ కోసం నేను విరూపాక్ష సినిమా చూశానని నిహారిక వెల్లడించారు. రాబోయే రోజుల్లో కూడా నటిగా కెరీర్ ను కొనసాగిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ఏదైనా ఛాన్స్ వస్తే యాక్టింగ్ కంటిన్యూ చేస్తానని నిహారిక పేర్కొన్నారు. చరణ్ ఐపీఎల్ టీం కొంటున్నారా అనే ప్రశ్నకు ఏ టీం కొంటున్నారో చెప్పాలంటూ ఆమె బదులిచ్చారు.

ఎంతో టాలెంట్ ఉన్న నిహారిక (Niharika) కెరీర్ పరంగా మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. నచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ నటిగా అంతకంతకూ ఎదుగుతున్నారు. రాబోయే రోజుల్లో నటిగా నిహారిక మరిన్ని సంచలనాలు సృష్టిస్తారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. నిహారిక వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus