మెగా డాటర్ నిహారిక పెళ్లిని అంగరంగ వైభవంగా చెయ్యడానికి రెడీ అవుతున్నారు ఆమె కుటుంబ సభ్యులు. గుంటూరు ఐజి కొడుకు మరియు సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అయిన చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరగబోతుంది.ఆ క్షణం కోసం కొణిదెల కుటుంబంలోని ప్రతిఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా హడావి డి ఇంకా తగ్గని తరుణంలో.. ఈ వివాహ వేడుకని తక్కువ మంది సమక్షంలో చేసినా . ప్రతి ఒక్కరికీ ఓ మధుర జ్ఞాపకంగా ఉండాలని నాగబాబు,
వరుణ్ తేజ్ లు ప్లాన్ చేశారు.ఈ క్రమంలో ఆసియాలోనే ది బెస్ట్ హోటల్ అయిన ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ప్యాలెస్ లో నిహారిక-చైతన్య ల వివాహాన్ని ప్లాన్ చేశారు. డిసెంబర్ 9న నిహారిక,చైతన్య ల వివాహం జరగబోతుంది.దీంతో నిహారిక-చైతన్య లు వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం ఆల్రెడీ ఉదయ్ విలాస్ ప్యాలెస్‌కు చేరుకున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే ది బెస్ట్ ప్యాలెస్ హోటల్స్‌లో ఐదో స్థానాన్ని దక్కించుకుంది ఉదయ్‌విలాస్. గతంలో ముఖేశ్ అంబానీ కూతురు ఈశా సంగీత్ వేడుకను ఇక్కడే నిర్వహించారు.
ఇప్పుడు నిహారిక పెళ్లి కూడా ఈ ప్యాలస్ లోనే జరుగుతుండడంతో … దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.వీటిని మీరు కూడా ఆ లుక్కెయ్యండి :