18PagesFirstLook: సుకుమార్ మార్క్ క్రియేటివిటీ అంచనాలు పెంచేస్తుందిగా..!

యంగ్ హీరో నిఖిల్ వరుసగా రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘కార్తికేయ2′ కాగా మరొకటి ’18 పేజెస్’. ఈరోజు నిఖిల్ పుట్టినరోజు కావడంతో ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ‘కరెంట్’ ‘కుమారి 21f’ వంటి విభిన్న కథా చిత్రాలను అందించిన పలనాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాగా గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. మన లెక్కల మాష్టారు సుకుమార్ ఈ చిత్రానికి కథ,స్క్రీన్ ప్లే అందిస్తుండటం తో మొదటి నుండీ ఈ సినిమాపై హైప్ ఏర్పడింది.

ఇక తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి.. ఇందులో నిఖిల్ సిద్ధు అనే పాత్రని పోషిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇక హీరోయిన్ అనుపమ.. నందిని అనే పాత్రలో నటిస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.హీరో నిఖిల్ కళ్ళకు ఓ పేపర్ ను అడ్డుపెట్టి ఆమె ఏదో రాస్తున్నట్టు ఈ పోస్టర్ ఉంది. ‘నా పేరు నందిని. నాకు మొబైల్ లో అక్షరాలను టైప్ చేయడం కన్నా ఇలా కాగితం పై రాయడం అంటే ఇష్టం.

టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు. ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటుంది. కానీ రాసే ప్రతి అక్షరానికి ఓ ఫీలింగ్ ఉంటుంది. దానిపై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది’ అంటూ ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ తన ట్విట్టర్లో పేర్కొంది. ఏమైనా సుకుమార్ క్రియేటివిటీతో కూడుకున్న ఈ పోస్టర్ ’18 పేజెస్’ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లిందనే చెప్పాలి.


Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus