Nikhil, Akhil: ‘ఏజెంట్’ అఖిల్ తో ‘స్పై’ నిఖిల్ పోటీ..!

విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న హీరో నిఖిల్.. త్వరలో ‘స్పై’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ‘ఈడి ఎంట‌ర్టైన‌మెంట్స్’ ప‌తాకంపై రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప‌ల‌పాటిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుకగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో విడుద‌ల కానుంది.

తాజాగా ఈ చిత్రం నుండీ చిన్న గ్లింప్స్ ను వదిలారు మేకర్స్. ఇందులో హీరో నిఖిల్ మంచుకొండల్లో ఆయుధాలు కలిగిన ఓ బాక్స్ ను కనిపెట్టి దాన్ని ఓపెన్ చేస్తాడు.. అటు తర్వాత బైక్ వెళ్తూ తుపాకీతో కాలుస్తున్నట్లు చూపించారు. ఈ గ్లింప్స్ చాలా స్టైలిష్ గా ఉంది.. జూలియన్ అమరు ఎస్ట్రాడ సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచింది అని చెప్పొచ్చు.శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచింది.

అంతా బాగానే ఉంది కానీ ‘స్పై’ చిత్రం కథ.. అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఏజెంట్’ కథకి సిమిలర్ గా ఉంటుందని కొద్దిరోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.తాజాగా విడుదలైన నిఖిల్ ‘స్పై’ గ్లింప్స్ ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. రెండు చిత్రాల్లోనూ హీరోలు స్పై పాత్ర పోషిస్తున్నంత మాత్రాన.. ఆ ఊహాగానాలు నిజమని ధృవీకరించలేము.

ట్రైలర్ వస్తే కొంతలో కొంత క్లారిటీ దొరికే అవకాశాలు ఉంటాయి. సురేందర్ రెడ్డి అఖిల్.. ‘ఏజెంట్’ ను డైరెక్ట్ చేస్తున్నాడు.మమ్ముట్టి కూడా ఆ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.’ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ‘ఏజెంట్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus