అప్పటివరకు పరాజయాలతో ఉన్న నిఖిల్ ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాలతో వరుస విజయాలు అందుకుని హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు. దానికి అసలు కారణం ఆ కథల్లోని కొత్తదనమే. అలా కథల ఎంపికలో క్రియాశీలకంగా వ్యవహరించిన నిఖిల్ పట్ల దర్శక నిర్మాతలు కూడా దృష్టి పెట్టారు. సరిగ్గా అప్పుడే ‘శంకరాభరణం’ రూపేణా నిఖిల్ కి మళ్ళీ ప్లాప్ ఎదురైంది. దీని వెనుక గల కారణాన్ని నిఖిల్ తాజాగా బయటపెట్టాడు.
నిఖిల్ కి ఈ సినిమా చేయడం తొలి నుండీ ఇష్టం లేదట. అయితే కొన్ని ఒత్తిళ్ల వల్ల ఈ సినిమా చేయక తప్పింది కాదట. పరిశ్రమలో ఇదేమీ కొత్త కాదు నిర్మాత మూలంగానే దర్శకుడితో ఉన్న అనుబంధం వలనో కొన్నిసార్లు నచ్చకపోయినా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా వారు చేసిన సినిమాల్లో విజయాల నుండి కాక పరాజయాల నుండి కొన్ని పాఠాలు నేర్చుకుంటామని చెబుతుంటారు మన తారలు. ఇదే విషయాన్ని తన అనుభవం దృష్ట్యా నిఖిల్ ‘ఒత్తిళ్ల వల్ల సినిమాలు చేయకూడదన్న విషయాన్ని శంకరాభరణంతో నేర్చుకున్నా’ అన్నాడు. నిఖిల్ పేరు చెప్పకపోయినా ఆ ఒత్తిడి కలిగించింది చిత్ర రచయిత, నిర్మాణ భాగస్వామి అయిన కోన వెంకట్ అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. పాపం ఈ కుర్రోడు ఇంతలా విసిగిపోయాడంటే కోన ఎంత హింసించుంటాడో..?
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.