పెళ్ళికొడుకు కాబోతున్న నిఖిల్..!

ఈఏడాది యంగ్ హీరోలంతా పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నితిన్ వివాహానికి సంబందించిన వార్తలతో సోషల్ మీడియా మొత్తం రచ్చ జరుగుతుంటే… ఇప్పుడు మరో యంగ్ హీరో నిఖిల్ కూడా రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ సర్ ప్రైజ్ చేసాడు. గతేడాది ‘2020 లో వివాహం చేసుకుంటాను’ అని నిఖిల్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. మంచు లక్ష్మీ టాక్ షోలో ‘తాను ఓ డాక్టర్ తో ప్రేమలో ఉన్నట్టు హింట్ ఇచ్చాడు నిఖిల్. ఆ అమ్మాయితోనే ఇప్పుడు వివాహం జరగబోతుందని స్పష్టమవుతుంది.

ఆమె పేరు పల్లవి వర్మ అట. ఈమెతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్.. ఈమధ్యే తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలిపి ఓకే అనిపించుకున్నాడట. పెద్దగా హడావిడి లేకుండా కొంతమంది సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడట. ఇక నిఖిల్ తన ప్రేయసితో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మొహం కనిపించకుండా ఈ ఫోటోలు ఉండటం గమనార్హం. ఇక ఏప్రిల్ 16న వీరి పెళ్ళి జరగబోతుందని సమాచారం.

1

2

3

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus