Nikhil: మన దేశంలో క్రీడా వ్యవస్థను మార్చండి.. నిఖిల్ షాకింగ్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నిఖిల్ (Nikhil Siddhartha) ప్రస్తుతం స్వయంభూ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కు చాలా సమయం ఉన్నా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అయితే సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే నిఖిల్ తాజాగా చేసిన ఒక ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. పిఫా వరల్డ్ క్వాలిఫయర్ మ్యాచ్ లో ఇండియా ఓటమి గురించి నిఖిల్ షాకింగ్ పోస్ట్ పెట్టారు.

పిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ఫుట్ బాల్ మ్యాచ్ ను ఇప్పుడే చూశానని నిఖిల్ అన్నారు. మన దేశ జట్టు అత్యంత తీవ్రంగా నిరాశపరిచిందని నిఖిల్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రదర్శన విషయంలో ఇండియా ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గు పడాలని ఆయన కామెంట్లు చేశారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉన్నా క్రీడల్లో మనం మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని నిఖిల్ పేర్కొన్నారు.

దయచేసి మన దేశంలో క్రీడా వ్యవస్థను మార్చండని నిఖిల్ వెల్లడించడం గమనార్హం. నిఖిల్ కు సపోర్ట్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిఖిల్ గత సినిమా స్పై బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. తర్వాత సినిమాలతో నిఖిల్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. నిఖిల్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉంది.

కార్తికేయ3 సినిమా కూడా త్వరలో ఉండబోతుందని నిఖిల్ కామెంట్లు చేశారు. నిఖిల్ కెరీర్ ప్లానింగ్ మాత్రం అదుర్స్ అనేలా ఉంది. నిఖిల్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. స్టార్ డైరెక్టర్స్ తో కలిసి పని చేస్తే నిఖిల్ రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. నిఖిల్ వరుస విజయాలతో కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా నిఖిల్ కెరీర్ ప్లాన్ ఉంది.

https://twitter.com/actor_Nikhil/status/1770921312782831987

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus