Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » మే 19న ‘కేశవ’ గ్రాండ్ రిలీజ్ !

మే 19న ‘కేశవ’ గ్రాండ్ రిలీజ్ !

  • April 29, 2017 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మే 19న ‘కేశవ’ గ్రాండ్ రిలీజ్ !

హిట్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు యంగ్‌ హీరో నిఖిల్‌.‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’, ‘కార్తికేయ’… మూడేళ్లుగా నిఖిల్‌ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. ఈ జైత్రయాత్ర ‘స్వామి రారా’ నుంచి మొదలైంది్. నిఖిల్‌ సూపర్‌హిట్‌ ఇన్నింగ్స్‌కి స్ట్రాంగ్‌ పునాది వేసిన దర్శకుడు సుధీర్‌వర్మ. ‘స్వామి రారా’ తర్వాత నిఖిల్, సుధీర్‌వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘కేశవ’. తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేసిన శ్రీ అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా నిర్మాత. ఇందులో ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కొప్పికర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మే 19న సమ్మర్ కానుకగా కేశవ ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ – ‘‘ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లకు, టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. టీజర్ ద్వారా సినిమాకు ఎంతటి బజ్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే. అంతకు మించిన ఎంటర్ టైన్ మెంట్ కేశవ ద్వారా లభిస్తుందని గ్యారంటీగా చెప్పగలం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘స్వామి రారా’ తరహాలో ఈ ‘కేశవ’ కూడా టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తుందని నమ్ముతున్నాం. నిఖిల్‌–సుధీర్‌వర్మ కాంబినేషన్, డిస్ట్రిబ్యూషన్‌లో మా సంస్థకున్న మంచి పేరు దృష్ట్యా బిజినెస్‌ పరంగా మంచి క్రేజ్‌ వచ్చింది. నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను ‘ఏసియన్‌ ఫిల్మ్స్‌’ సునీల్‌ నారంగ్‌ ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నారు. మే 19న కేశవను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.

హీరో నిఖిల్‌ మాట్లాడుతూ – ‘‘సుధీర్‌వర్మ, నేనూ మంచి స్నేహితులం. ‘స్వామి రారా’తో మా ఇద్దరి కెరీర్‌ కొత్త టర్న్‌ తీసుకుంది. ఆ సినిమా తరహాలో ‘కేశవ’ కూడా సూపర్‌ హిట్టవుతుందని నమ్ముతున్నాను. సుధీర్‌వర్మ టేకింగ్‌ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. నా క్యారెక్టర్‌ ని చాలా కొత్తగా డిజైన్‌ చేశాడు. మే 19న మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు. దర్శకుడు సుధీర్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. నిఖిల్, రితూ వర్మ, ఇషా కొప్పికర్‌ క్యారెక్టరైజేషన్‌లు చాలా కొత్తగా ఉంటాయి’’ అన్నారు. రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్ట్‌: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్‌ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్‌., సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సుధీర్‌వర్మ, నిర్మాత: అభిషేక్‌ నామా, సమర్పణ: దేవాన్ష్‌ నామా.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ritu Varma
  • #keshava movie
  • #Nikhil
  • #Nikhil Movies
  • #Priyadarshi

Also Read

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

related news

Mithra Mandali Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు మరింత పడిపోయాయి

Mithra Mandali Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు మరింత పడిపోయాయి

Mithra Mandali Collections: నిరాశపరిచిన ‘మిత్రమండలి’ ఫస్ట్ డే కలెక్షన్స్!

Mithra Mandali Collections: నిరాశపరిచిన ‘మిత్రమండలి’ ఫస్ట్ డే కలెక్షన్స్!

Mithra Mandali: ‘మిత్రమండలి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

Mithra Mandali: ‘మిత్రమండలి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

Mithra Mandali Review in Telugu: మిత్ర మండలి సినిమా రివ్యూ & రేటింగ్!

Mithra Mandali Review in Telugu: మిత్ర మండలి సినిమా రివ్యూ & రేటింగ్!

Mithra Mandali First Review: మిత్రమండలి’ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద సిక్సు కొట్టేలా ఉందా?

Mithra Mandali First Review: మిత్రమండలి’ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద సిక్సు కొట్టేలా ఉందా?

Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

trending news

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

2 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

3 hours ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

3 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

3 hours ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

4 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

2 hours ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

3 hours ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

4 hours ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

6 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version