బన్నీ కోసం సుకుమార్ పెద్ద ప్లానే వేశాడు!

అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న కొత్త సినిమా ‘పుష్ప’ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో చిత్రమిది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల పునః ప్రారంభమైంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించబోతున్నారనే విషయంలో రకరకాల వార్తలు వినిపించాయి. కొందరు బాలీవుడ్ స్టార్ల పేర్లు కూడా వినిపించాయి. నిజానికి ఈ సినిమాలో విలన్ ఒక్కడు కాదట. ఇందులో మొత్తం తొమ్మిది మంది విలన్లు ఉంటారట.

అందులో నటుడు సునీల్ కి కూడా ఓ పాత్ర దక్కిందని సమాచారం. ముఖేష్ రుషి, రావు రమేష్ ఇలా ఇప్పటివరకు టాలీవుడ్ లో విలన్లుగా నటించిన కొందరు ఈ సినిమాలో విలన్ గ్యాంగ్ లో కనిపించనున్నారు. అయితే మెయిన్ విలన్ ఒకరుంటారని తెలుస్తోంది. సునీల్ ఈ మధ్య కాలంలో నెగెటివ్ పాత్రలవైపు మొగ్గు చూపుతున్నారు. ‘డిస్కో రాజా’ సినిమాలో నెగెటివ్ టచ్ ఉన్న రోల్ లో కనిపించారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో సునీల్ కి పేరు రాలేదు.

రీసెంట్ గా విడుదలైన ‘కలర్ ఫోటో’ సినిమాలో కూడా సునీల్ విలన్ పాత్ర పోషించాడు. ఈ సినిమా సునీల్ కి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు సుకుమార్ సినిమాలో కూడా సునీల్ డిఫరెంట్ తరహాలో సాగే విలన్ పాత్ర పోషించబోతున్నాడు. అంటే తొమ్మిది మంది విలన్లతో అల్లు అర్జున్ ఢీ కొట్టబోతున్నాడన్నమాట. యాక్షన్ పరంగా బన్నీ కోసం సుకుమార్ పెద్ద ప్లాన్ వేశాడని తెలుస్తోంది.

ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ హిందీ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరున్న ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus