Ninnu Chere Tarunam: ఆకట్టుకుంటున్న ‘నిన్ను చేరే తరుణం’ వీడియో గ్లింప్స్..!

2017 లో వచ్చిన ‘గీత సుబ్రహ్మణ్యం’ వెబ్ సిరీస్ ను అంత ఈజీగా మరచిపోలేము. తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా అలరించిన వెబ్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి. అందులో సుబ్రహ్మణ్యం పాత్రలో కనిపించి ప్రేక్షకులను తన నటనతో రంజింప చేసిన మనోజ్ కృష్ణ తన్నీరు ని కూడా అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు.ఆ వెబ్ సిరీస్ లో ఇతను పలికించిన హావ భావాలు యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇదిలా ఉండగా..

ఇతను త్వరలో బిగ్ స్క్రీన్ పై కూడా సందడి చేయడానికి రెడీ అయ్యాడు. అతను హీరోగా ‘నిన్ను చేరే తరుణం’ అనే చిత్రం రూపొందుతోంది. ‘ఆర్టిస్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని మనోజ్ తన్నీరు, నవీన్ తన్నీరు కలిసి నిర్మిస్తున్నారు.ఎఫి రోగర్స్ ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ చిత్రం నుండీ వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ప్రతిష్టాత్మక లహరి మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ వారు ఈ వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు.

ప్రేమకథల్లో ఇప్పటివరకు మనం చూడని కొత్త కోణాన్ని పరిచయం చేసే విధంగా ఈ గ్లింప్స్ సాగింది. ‘కోరుకున్న శ్వాసే చేరుకున్న నీవై’ అంటూ సిద్ శ్రీరామ్ ఆలపించిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. నిజానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పొచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఈ వీడియో గ్లింప్స్ సాగింది. సినిమా పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది అని చెప్పొచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి :


ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus