అంచనాలు పెంచేస్తున్న అనుష్క నిశ్శబ్దం ట్రైలర్

అనుష్క మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ నిశ్శబ్దం. దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అనుష్క మూగదైన పెయింటింగ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెత్ తో అమెరికాలోని సియాటిల్ నగరం నందు అధిక భాగం షూటింగ్ పూర్తి చేశారు. ఇక ఈ మూవీలో హీరోయిన్స్ అంజలి మరియు షాలిని పాండే కూడా నటిస్తున్నారు. హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసన్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. కాగా వచ్చే నెల 2న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈనేపథ్యంలో నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.

దాదాపు ఒకటిన్నర నిమిషము సాగిన ట్రైలర్ మిస్టీరియస్ గా ఉంది. అనుష్క, మాధవన్ వెకేషన్ లో జరిగిన దిగ్బ్రాంతికర సంఘటనల వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి.. వ్యక్తి ఎవరు అనేదే నిశ్శబ్దం మూవీ థీమ్ అని అర్థం అవుతుంది. ఆ సంఘటనలో బాధితురాలిగా అనుష్క కనిపిస్తుండగా, ఆ కేసుని ఛేదించే లేడీ కాప్ రోల్ అంజలి చేస్తున్నారు. ఇక షాలిని పాండే కి సైతం ఈ మూవీ కథలో ప్రాధాన్యం ఉందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. అంచనాలు తగ్గట్టుగా నిశ్శబ్దం ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. కోనా వెంకట్, టి జి విశ్వ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.


పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus