నితిన్ కి (Nithiin) ప్లాపులు కొత్త కాదు. కానీ ఈ మధ్య అరడజను ప్లాపులు ఇస్తేనే కానీ ఒక్క హిట్ కొట్టలేని పరిస్థితి అతనిది. కోవిడ్ కి ముందు ‘భీష్మ’ తో (Bheeshma) హిట్టు కొట్టాడు. వెంకీ కుడుముల (Venky Kudumula) డైరెక్ట్ చేసిన మూవీ అది. అయితే కోవిడ్ తర్వాత ‘చెక్’ (Check) ‘రంగ్ దే’ (Rang de) ‘మాస్ట్రో'(Maestro) ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) ‘ఎక్స్ట్రా’ (Extra Ordinary Man) వంటి సినిమాలతో నిరాశపరిచాడు. ఇందులో ‘మాస్ట్రో’ ‘రంగ్ దే’ సేఫ్ అయినా.. మిగిలిన సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి.
దీంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని భావించి.. ‘భీష్మ’ తో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ‘రాబిన్ హుడ్’ (Robinhood) చేశాడు. ఇది వాటికి మించిన డిజాస్టర్ అయ్యింది. విచిత్రం ఏంటంటే ఈ సినిమాని ‘మైత్రి’ సంస్థ నిర్మించింది. పెద్ద సినిమాలతో సమానంగా ప్రమోట్ చేశారు. కానీ ఫలితం లేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. నిర్మాతలు రూ.70 కోట్ల వరకు పెట్టారు. నాన్ థియేట్రికల్ రూపంలో సగం మాత్రమే వచ్చింది.
థియేటర్ల నుండి రూ.10 కోట్లు కూడా అతి కష్టం మీద వచ్చింది. దీంతో నితిన్ మార్కెట్ ఎంత డౌన్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే నెక్స్ట్ మూవీస్ అయిన ‘తమ్ముడు’ (Thammudu) ‘ఎల్లమ్మ’..ల పై చాలా ఆశలు పెట్టుకున్నాడు నితిన్. ఈ 2 సినిమాలకి దిల్ రాజు (Dil Raju) నిర్మాత. ‘తమ్ముడు’ కి ‘వకీల్ సాబ్’ (Valeel Saab) ఫేమ్ వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకుడు. ‘ఎల్లమ్మ’ కి ‘బలగం’ (Balagam) ఫేమ్ వేణు (Venu Yeldandi) దర్శకుడు. మరి ఇవైనా నితిన్ ను గట్టెక్కిస్తాయేమో చూడాలి.