పెళ్ళి, పార్టీలతో నితిన్ బిజీ.. బిజీ…!

నితిన్ త్వరలో పెళ్ళి కొడుకు కాబోతున్నాడు అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. షాలిని అనే ఎం.బి.ఏ గ్రాడ్యుయేట్ తో నితిన్ గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే మళ్ళీ ఈ విషయం పై ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నితిన్ పెళ్ళి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకి వచ్చాయి. ఎగ్జాక్ట్ గా నితిన్ పెళ్ళి డేట్ కానీ.. ఎంగేజ్మెంట్ డేట్ కానీ ఫిక్స్ చేయలేదు. అయితే పెళ్ళి మాత్రం ఏప్రిల్ లో అదీ దుబాయ్ లో ఉంటుందని టాక్. ఆల్రెడీ ఇంట్లో వాళ్ళను ఒప్పించాడు కాబట్టి.. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం.

బందుమిత్రులు, సన్నిహితులు మధ్య ఈ పెళ్ళి జరుగనుందట. అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ హాజరవుతారని తెలుస్తుంది. అంతేకాదు పెళ్ళికి ముందు నితిన్ ఇండస్ట్రీలో ఉన్న తన స్నేహితులకు గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీని కూడా ప్లాన్ చేస్తున్నాడట. వీటన్నిటికి సంబందించిన పనులను నితిన్ సోదరి.. నిర్మాత అయిన నికిత రెడ్డి దగ్గరుండి చూసుకుంటుందని సమాచారం. ఓ పక్క మూడు సినిమాల్లో నటిస్తూనే..మరోపక్క పెళ్ళి పనుల్లో కూడా నితిన్ బిజీగా గడపబోతున్నాడని స్పష్టం అవుతుంది.ఇక నితిన్ ‘భీష్మ’ చిత్రం ఫిబ్రవరి 21 న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus