నితిన్‌ ప్లానింగ్‌ స్ట్రాంగ్‌గానే ఉందా?

వరుస ఫ్లాప్‌లు వచ్చిన తర్వాత ఓ హీరో తట్టుకొని నిలబడం చాలా కష్టం. అందులోనూ పదికిపైగా సినిమాలు ఫ్లాప్‌ తర్వాత వచ్చి హిట్‌ కొట్టడం మామూలు విషయం కాదు. అలాంటి పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో సినిమా చేసి హిట్‌ కొట్టి నిలబడ్డాడు నితిన్‌. ఇదంతా పాత విషయం. ఆ తర్వాత కూడా నితిన్‌కి ఫ్లాప్‌లు వచ్చాయి. అయితే వరుసగా రాలేదు. అంతగా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. దగ్గరదగ్గర్లో సినిమాలు రాకుండా చూసుకుంటున్నాడు. అయితే కరోనా రాసిన ప్లానింగ్‌ వల్ల నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలు రాబోతున్నాయి.

చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో చేస్తున్న ‘చెక్‌’ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సినిమా నేపథ్యం వింటుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ లాంటి ముద్దుగుమ్మలు సినిమాకు అదనపు ఆకర్ణణలు. ఉరిశిక్ష పడ్డ కుర్రాడి జీవితం నేపథ్యంలో సాగే ఈ సినిమాతో ఈసారి చంద్రశేఖర్‌ యేలేటి కచ్చితంగా హిట్‌ కొడతాడని ఇండస్ట్రీ టాక్‌. మరోవైపు ‘రంగ్‌దే’ లాంటి వెరైటీ ప్రేమకథ కూడా చేస్తున్నాడు నితిన్‌. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నాయిక. టీజర్‌లో ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ అని చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమాను మార్చి మిడిల్‌లో తీసుకొస్తారని టాక్‌.

చూశారుగా… నితిన్‌ ఇలా నెల వ్యవధిలో రెండు సినిమాలతో రాబోతున్నాడు. అంత ధైర్యం ఏంటి అనేది చాలామంది డౌట్‌. రెండు సినిమాలు వేర్వేరు నేపథ్యాల్లో ఉండటం ఒక పాయింట్‌ అయితే, ఇద్దరికిద్దరు అదిరిపోయే దర్శకులు కావడమూ గమనార్హం. మరోవైపు కథల విషయంలో నితిన్‌ బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని కూడా తెలుస్తోంది. ఈ ధైర్యంతోనే నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో వస్తున్నాడట నితిన్‌. ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి.. బెస్ట్‌ సినిమాల కోసం వెయిట్‌ చేద్దాం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus