షాకింగ్ డెసిషన్ తీసుకున్న ‘రంగ్ దే’ టీం..!

అక్టోబర్ లేదా నవంబర్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఓ పక్కన కాస్త ఊరట కలిగించే వార్తలు వస్తుంటే.. మరోపక్క మంచి క్రేజ్ ఉన్న సినిమాలను ఓటిటిలో విడుదలచెయ్యడానికి నిర్మాతలు ఎగబడుతుండడం పెద్ద చర్చకు దారి తీస్తుంది. పెట్టిన పెట్టుబడి వెనక్కు రాబట్టుకునేందుకు.. ఓటిటి సంస్థల నుండీ వచ్చే ఫ్యాన్సీ రేట్లకు టెంప్ట్ అయ్యి ఇలా ఓటిటిలకు సినిమాలను ఇచ్చేస్తున్నారా లేక 2021 జనవరికి కూడా థియేటర్లు ఓపెన్ అవ్వవు అని సింబాలిక్ గా చెబుతున్నారా అనేది కన్ఫ్యూజ్ చేసే విషయం.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు నితిన్ ‘రంగ్ దే’ చిత్రాన్ని కూడా ఓటిటిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట నిర్మాతలు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘తొలిప్రేమ’ ‘మిస్టర్ మజ్ను’ వంటి చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు.స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. నితిన్ కు జోడీగా నటిస్తుంది. నితిన్ పెళ్లి రోజున ‘రంగ్ దే’ టీజర్ ను విడుదల చేసి, ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యబోతున్నట్టు కూడా దాని ద్వారా ప్రకటించారు.

అయితే ఏమైందో ఏమో.. కానీ ‘రంగ్ దే’ చిత్రాన్ని ఇప్పుడు ఓటిటిలో విడుదల చెయ్యబోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది. ‘అమెజాన్ ప్రైమ్’ మరియు ‘జీ5’ వంటి ఓటిటి సంస్థలు నుండీ ‘రంగ్ దే’ కు భారీ ఆఫర్లు వస్తున్నాయట. అయితే ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ భాకీ ఉంది. మరి ఇలాంటి టైంలో నిర్మాతలు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి..!

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus