లాక్ డౌన్ అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్ బాగా జరుగుతున్నప్పటికీ.. ఓవర్సీస్ లో మాత్రం వర్కవుట్ అవ్వలేదు. సంక్రాంతికి విడుదలైన పెద్ద సినిమాలకి కూడా ఓవర్సీస్ లో బయ్యర్లు దొరక్క సరైన బిజినెస్ జరగలేదు. కానీ ఇప్పుడిప్పుడే ఓవర్సీస్ మార్కెట్ పుంజుకుంటుంది. ‘ఉప్పెన’, ‘జాతిరత్నాలు’ లాంటి సినిమాలు భారీ కలెక్షన్స్ ని రాబట్టడంతో ఓవర్సీస్ లో మార్కెట్ కి బలం చేకూరుతుంది. ఈ సినిమాల సక్సెస్ నితిన్ ‘రంగ్ దే’ సినిమాకి ఫేవర్ చేశాయని చెప్పాలి.
‘రంగ్ దే’ సినిమా ఓవర్సీస్ హక్కులు ఫారెస్ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది. దీనికోసం రూ.1.5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు థియేటర్ మార్కెట్, నాన్ థియేటర్ హక్కులు మొత్తం కలిపి రూ.36 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు జరిగిన ఓవర్సీస్ డీలింగ్ తో కలిపి మొత్తం సినిమాకి రూ.37.5 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా నిర్మాణానికి పెట్టిన ఖర్చు రూ.32 కోట్లు. ఈ లెక్కన చూసుకుంటే ఈ సినిమా రిలీజ్ కి ముందే నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది.
రిలీజ్ తరువాత ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!