Nithya Menen: భీమ్లాపై అంచనాలు పెంచిన నిత్యా మీనన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటిగా గుర్తింపును సొంతం చేసుకున్న నిత్యామీనన్ కు స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రాలేదనే సంగతి తెలిసిందే. సన్నాఫ్ సత్యామూర్తి, జనతా గ్యారేజ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసిన నిత్యామీనన్ కు చాలా సంవత్సరాల తర్వాత భారీ పాజెక్ట్ లో ఛాన్స్ దక్కింది. భీమ్లా నాయక్ మూవీలో మెయిన్ హీరోయిన్ రోల్ లో నిత్యామీనన్ నటిస్తున్నారు. నిత్యామీనన్ భీమ్లా నాయక్ సినిమా గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ కాల్ చేసి పవన్ తో సినిమా చేస్తున్నానని ఒక పాత్ర చేయాలని అడిగారని చెప్పుకొచ్చారు.

పవన్ కు లేడీ పవన్ వస్తుందని చెప్పానని త్రివిక్రమ్ తనతో చెప్పారని ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందని చెప్పి త్రివిక్రమ్ తనను ఒప్పించారని నిత్య అన్నారు. పవన్ ఎక్కువగా మాట్లాడరని మౌనంగా ఉంటారని నిత్యామీనన్ తెలిపారు. భీమ్లా నాయక్ షూటింగ్ లో లేడీ పవర్ స్టార్ లాంటి ఫీలింగ్ కలిగిందని నిత్యామీనన్ చెప్పుకొచ్చారు. నా స్వభావానికి తగిన విధంగా భీమ్లా నాయక్ సినిమాలో పాత్ర ఉంటుందని నిత్యామీనన్ అన్నారు. ఒక పాట మినహా భీమ్లా నాయక్ లో తన పాత్ర షూటింగ్ పూర్తైందని నిత్యామీనన్ చెప్పుకొచ్చారు.

భీమ్లా నాయక్ లో నటించడం మంచి అనుభవమని నిత్యామీనన్ వెల్లడించారు. తెలుగులో కొంచెం గ్యాప్ ఎక్కువైందని నిత్యామీనన్ కామెంట్లు చేశారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నానని నిత్యామీనన్ చెప్పుకొచ్చారు. స్కైలాబ్ మంచి అనుభూతిని కలిగించే సినిమా అని ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అనుకుంటున్నానని నిత్యామీనన్ పేర్కొన్నారు. భీమ్లా నాయక్ పై అంచనాలు పెరిగేలా నిత్యామీనన్ కామెంట్లు చేశారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus